Latest Posts

Profitable Companies: దేశంలో టాప్-25 కంపెనీలు.. సూపర్ ప్రాఫిట్స్ అందిస్తూ.. ఈ స్టాక్స్ కొన్నారా..?

లాభాల విషయంలో..

నిజానికి దీర్ఘకాలంలో కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే అంచనాలకు అనుగుణంగా లాభాలను అందించగలవు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు ఇన్వెస్టర్ల అంచనాలకు అనుగుణంగా లాభాలను అందించటంలో వెనుకబడుతుంటాయి. అలాగే మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వాటి వ్యాపార ధృక్పదం, ఉత్పత్తులు సైతం మారుతుంటాయి. ఇవి లాభాలపై భారీ మార్పులను తీసుకొస్తాయి.

సురక్షితమైన పెట్టుబడి..

ఇలాంటి మార్కెట్ ఒడిదొడుకుల సమయంలో.. చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద నష్టాల నుంచి రక్షించుకోవడానికి అధిక లాభదాయకమైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతుంటారు. నష్టనివారణే వారికి కీలకం. అంతిమంగా లాభాలను ఆర్జించటమే ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి.

25 అత్యంత లాభదాయకమైన కంపెనీలు..

2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యంత లాభదాయకమైన 25 లిస్టెడ్ కంపెనీల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అలా.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) మెుదటి స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.40,306 కోట్ల నికర లాభంతో అగ్రస్థానంలో ఉంది. ఇది ఇన్వెస్టర్లకు మంచి డివిడెండ్ ఆదాయాన్ని కూడా అందిస్తుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్..

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.39,084 కోట్ల నికర లాభంతో రెండో స్థానంలో నిలిచింది. ఈ కాలంలో కంపెనీ క్యాపిటలైజేషన్ దాదాపు 17,56,046 కోట్లగా ఉంది. అలా మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత స్టాక్ మార్కెట్‌లో అత్యంత విలువైన కంపెనీగా కూడా రికార్డ్ సృష్టించింది.

టెక్ దిగ్గజం TCS..

రూ.38,187 కోట్ల నికర లాభంతో దేశీయ టెక్ దిగ్గజం TCS మూడో స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.36,961 కోట్లు నికర లాభంతో నాల్గవ స్థానంలో ఉండగా, టాటా స్టీల్ రూ.33,011 కోట్లు, ఎస్‌బీఐ రూ.31,676 కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.24,184 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.23,339 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.21,235 కోట్లు, వేదాంత రూ.17,245 కోట్ల లాభాలను ఆర్జిస్తూ మొదటి 10 స్థానాల్లో నిలిచాయి.

చివరి 15 స్థానాల్లోని కంపెనీలు..

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.17,093.80 కోట్లు, JSW స్టీల్ రూ.16,702.00 కోట్లు, NTPC రూ.16,111.40 కోట్లు, ITC రూ.15,057.80 కోట్లు, HDFC రూ.13,742.20 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ. 13,742.20 కోట్లు, కోల్ ఇండియా రూ.11,201.60 కోట్లు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.10,874.00 కోట్లు, గెయిల్ (ఇండియా) రూ.10,364.00 కోట్లు, ఆర్‌ఈసీ రూ.10,045.90 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.10,021.90 కోట్లు, హిందుస్తాన్ జింక్ రూ.9,630 కోట్లు, ఎన్ఎమ్డీసీ రూ.9,398.50 కోట్ల లాభంతో కంపెనీలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తున్నాయి. ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టాలని చాలా మంది యోచిస్తుంటారు.

Latest Posts

Don't Miss