లైఫ్ ఇన్సూరెన్స్..
ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కుటుంబాన్ని రక్షించడానికి ఆర్థిక రక్షణ, భరోసా కల్పించేందుకు మనం ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేస్తుంటాము. అయితే.. ఇన్సూరెన్స్ కంపెనీలు తరచుగా క్లెయిమ్‌ను చెల్లించటానికి తిరస్కరిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో కంపెనీలు క్లెయిమ్ మొత్తాన్ని తీసివేసి పరిహారం చెల్లిస్తాయనే విషయం కూడా తెరపైకి వచ్చింది. అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌లను ఎందుకు తిరస్కరిస్తాయి? ఎలాంటి తప్పిదాలు దీనికి కారణాలు నిలుస్తాయో ఇప్పుడు తప్పక తెలుసుకోవాలి.
సైరస్ మిస్త్రీ ప్రమాదం..
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో ముంబయి సమీపంలో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత ప్రమాద కేసుల్లో క్లెయిమ్ విషయంపై అనుమానాల నివ్రృత్తికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బీమా క్లెయిమ్ పొందటానికి ఉన్న నియమాల గురించి అధికారులు చెబుతున్న విషయాలు ఇప్పుడు గమనిద్దాం.
సీటు బెల్ట్ ధరించనందుకు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందా..?
కేర్ లెస్ నెస్ కారణంగా దురదృష్టకర సంఘటనకు దారితీసినట్లయితే.. వాహనానికి జరిగిన నష్టాన్ని చట్టపరంగా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చెల్లించవలసి ఉంటుంది. అయితే వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు సీటు బెల్ట్ పెట్టుకున్నా లేక పెట్టుకోకపోయినా దాని ఆధారంగా క్లెయిమ్ రిజెక్ట్ చేయటం కుదరదని ఇన్సూరెన్స్ అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తి సీటు బెల్ట్ ధరించాడా లేదా అనేది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన విషయం కాదని ప్రూడెంట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్జిత్ సింగ్ ధింగ్రా స్పష్టం చేశారు.
మానవ తప్పిదాలకు ఇన్సూరెన్స్ వస్తుందా..?
మానవ తప్పిదాల వల్ల లేదా మరేదైనా ప్రమాదం నుంచి రక్షణ పొందటానికి ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తారని ఆ రంగంలోని కంపెనీలు చెబుతున్నాయి. మానవ తప్పిదాలు లేదా నిబంధనలను ఉల్లంఘించినప్పుడు కూడా ఇన్సూరెన్స్ పాలసీ పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని, ప్రమాదవశాత్తు మరణానికి సంబంధించిన క్లెయిమ్‌లను అంగీకరించడం కొనసాగుతుందని వారు స్పష్టంగా చెబుతున్నారు. అయితే.. అసాధారణమైన సందర్భాల్లో పరిహారం మొత్తాన్ని తగ్గించవచ్చే అవకాశం ఉంది.
ఐసీఐసీఐ లాంబార్డ్..
చాలా ప్రమాదాలు మనుషుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ (రిస్క్ అసెస్మెంట్ & క్లెయిమ్స్) సంజయ్ దత్తా చెబుతున్నారు. పాలసీని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా తలెత్తే ప్రమాదాలు కూడా దీని పరిధిలోకి వస్తాయని ఆయన అంటున్నారు.
బజాజ్ అలయన్జ్..
ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి కాంప్రిహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉంటే.. నిబంధనల ప్రకారం వాహనానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయటం జరుగుతుందని బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తపన్ సింగ్లా తెలిపారు. ఇదే సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు కూడా కవర్ లభిస్తుందని తెలిపారు.