బ్రోకరేజ్ మాట ఇదే..
దేశీయ బ్రోకరేజ్ అండ్ రీసెర్చ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ ఆరు స్టాక్లను పండుగకోసం సూచించింది. రానున్న పండుగ డిమాండ్ వల్ల ఈ షేర్లు ఇన్వెస్టర్లకు బంపర్ రాబడిని అందిస్తాయని బ్రోకరేజ్ అంచనా వేసింది.
Maruti Suzuki:
పండుగకు కొత్త మోడళ్ల లాంచ్‌ల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్ చేయడం, కమోడిటీ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, మార్జిన్లలో రికవరీ వంటికి స్టాక్ పెరుగుదలకు దోహదపడతాయని బ్రోకరేజ్ అంచనా వేసింది. పైగా వస్తున్న దసరా, దీపావళికి కొత్త వాహనాలు కొనాలనుకునే చాలా మంది నుంచి కంపెనీకి సేల్స్ పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, CNG, హైబ్రిడ్ వాహనాల వైపు ఊహించిన మార్పుతో కంపెనీ మరింత మార్కెట్ వాటాను పొందుతోంది. ఈ కంపెనీ షేర్ విలువ రూ.9,801ని తాకుతుందని అంచనాతో టార్గెట్ ధరను వెల్లడించింది. కంపెనీ వాల్యూమ్‌లు బలమైన వృద్ధిని సాధిస్తాయని వారి అంచనాలు చెబుతున్నాయి.
Bajaj Finance:
కంపెనీ డిజిటల్ కార్యక్రమాలు, వ్యాపార పరివర్తన ఎదురుచూడడానికి కీలకమైన సానుకూలాంశాలను బజాజ్ ఫైనాన్స్ కలిగి ఉంది. రానున్న పండుగలకు కంపెనీలు భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తాయి కాబట్టి.. ఎక్కువ మంది గృహోపకరణాలు, ఫర్నిచర్, ఇతర ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేయటం కంపెనీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. కంపెనీ షేరుకు బ్రోకరేజ్ సంస్థ రూ.8,250 టార్గెట్ ధరను ప్రకటించింది.
SBI Cards:
బలమైన వ్యాపారం ఊపందుకోవటం కంపెనీని ప్రస్తుతం బాగా కలిసివస్తోంది. క్రెడిట్ ఖర్చులు సైతం తగ్గినట్లు తెలుస్తోంది. UPIతో రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడంపై RBI తెచ్చిన తాజా నిర్ణయం క్రెడిట్ కార్డ్ పరిశ్రమకు వృద్ధిని ఇచ్చే అంశంగా ఉంది. ఈ క్రమంలో కొత్తగా క్రెడిట్ కార్డులు తీసుకునేవారి సంఖ్య పెరగటం చూడవచ్చని కంపెనీ భావిస్తోంది. ఇది వ్యాపార అభివృద్ధికి దోహదపడటంతో పాటు లాభదాయకతను పెంచనుంది. ఈ సానుకూల అంశాల వల్ల బ్రోకరేజ్ కంపెనీ షేరుకు రూ.1,050 టార్గెట్ ధరగా ప్రకటించింది.
Trent:
సుపీరియర్ స్టోర్ మెట్రిక్‌లు, సప్లయ్ చైన్ ఆప్టిమైజేషన్, కాస్ట్ రేషనలైజేషన్‌పై శ్రద్ధ, దూకుడుగా స్టోర్ల విస్తరణ, ప్రైవేట్ బ్రాండ్ల నుంచి అధిక సహకారం, వాల్యూ స్పేస్‌లో వినూత్నమైన ఆఫర్లు దీర్ఘకాలంలో బ్రోకరేజీ కంపెనీ వృద్ధికి కీలకమైనవిగా భావిస్తోంది. ఈ క్రమంలో స్టాక్ కు రూ.1,530 టార్గెట్ ధరకు BUY రేటింగ్ ఇచ్చింది.
Relaxo:
Relaxo పాదరక్షల తయారీ రంగంలో వ్యాపారం నిర్వహిస్తోంది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో మార్కెట్ వాటాను పొందటం కంపెనీకి అనుకూలమైన అంశంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన విలువ కలిగిన ఉత్పత్తులకు డిమాండ్‌ను కొనసాగించడం, బలమైన పండుగ సీజన్ రానున్న కాలంలో కంపెనీకి సానుకూలమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఈ కారణాల వల్ల బ్రోకరేజ్ సంస్థ షేరుకు రూ.1,120 టార్గెట్ ధరగా నిర్ణయించి BUY రేటింగ్ ఇచ్చింది.
V-Mart:
గ్రామీణ, చిన్న పట్టణాల్లో కంపెనీ తన వ్యాపారాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో డబ్బుకు విలువ ఇచ్చే నాణ్యమైన చౌక ఉత్పత్తులు, పండుగ సీజన్ వల్ల కంపెనీ లాభదాయకత మెరుగుపడుతోంది. ఈ కారణాల వల్ల బ్రోకరేజ్ సంస్థ షేరుకు రూ.3,350 టార్గెట్ ధరగా నిర్ణయించి BUY రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం షేర్లు మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ధరలతో పోల్చితే ఇవి మంచి టార్గెట్లను కలిగి ఉన్నాయి. వీటిపై సరైన నిర్ణయం తీసుకున్న తరువాత మీరు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం అని మా సూచన.