హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్టైన్మెంట్ Esther l: ‘దృశ్యం’ పాప ఎస్తేర్ అనిల్ రియల్ ఫ్యామిలీ పిక్స్ By : Desam | Updated: 08 Sep 2022 09:18 PM (IST)
‘దృశ్యం’ మూవీ సీరిస్లో బాలనటిగా కనిపించిన ఎస్తేర్ అనిల్ ఓనమ్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. తన కుటుంబంతో కలిసి ఈ సంబురాల్లో పాల్గొన్నది. రియల్ ఫ్యామిలీ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
కేరళకు చెందిన మలయాళ కుట్టి ఎస్తేర్ అనిల్.. వయనాడ్లో 2001లో జన్మించింది. 2010లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల వయస్సులో ‘నల్లవన్’ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో ఆమె బాలనటిగా నటించి ఆకట్టుకుంది. [email protected]_estherl/instagram
ఆమెకు 2013లో మలయాళ చిత్రం ‘దృశ్యం’లో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయస్సు 12 ఏళ్లు. ఆ తర్వాత 2014లో తెలుగులో రిమేక్ చేసిన ‘దృశ్యం’లో కూడా ఆమే నటించింది. అప్పటికి ఆమెకు 13 ఏళ్లు. చూసేందుకు చిన్న పిల్లగా కనిపించడంతో ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. [email protected]_estherl/instagram
‘దృశ్యం’ హిట్ కొట్టినా.. ఆ చిత్ర దర్శక నిర్మాతలు ‘దృశ్యం-2’ను తెరకెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు. [email protected]_estherl/instagram
మొదటి పార్ట్ కంటే థ్రిల్లింగ్ ఎక్స్పీయరెన్స్ ఇచ్చేందుకు ఆరేళ్లు కష్టపడ్డారు. ఈలోపు ఆ చిత్రంలో చిన్నారిగా మెప్పించిన ఎస్తేర్ వయస్సు కూడా పెరిగిపోయింది. గతేడాది ‘జోహార్’ మూవీలో తళుక్కుమంది. [email protected]_estherl/instagram
మొత్తానికి ‘దృశ్యం 2’ కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో విడుదలైన తెలుగు ‘దృశ్యం 2’కు మంచి రేటింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్తేర్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. [email protected]_estherl/instagram
Tags: Esther l Esther l Photos Esther l Hot Pics Esther l Onam pics