CM Mamata Banerjee: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా పోరాడతాయని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపాకు వ్యతిరేకంగా నితీశ్ కుమార్, హేమంత్ సొరెన్ వంటి నేతలతో కలిసి పోరాడతామని దీదీ తేల్చి చెప్పారు.
” మేం ఐకమత్యంగా ముందుకు సాగుతాం. నితీశ్ కుమార్, అఖిలేశ్, హేమంత్ సొరెన్ వంటి నేతలతో కలిసి ఐక్యంగా భాజపాపై పోరాడతాం. రాజకీయం అంటేనే యుద్ధ రంగం. 34 ఏళ్లుగా ఇందులో పోరాడుతున్నాం. ఝార్ఖండ్‌లో ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేద్దామని భాజపా చేసిన ప్రయత్నాలను మేం అడ్డుకున్నాం. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అక్కడి ప్రభుత్వాన్ని కాపాడాం. ” -మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
భయపడరు
రాజకీయ పార్టీల్లో విభేదాలను మీడియా కొండంతలుగా చూపుతుందని దీదీ ఆరోపించారు. గతంలో తనకు అభిషేక్ బెనర్జీ మధ్య విభేదాలున్నాయని కూడా చూపించారని దీదీ అన్నారు. అయితే ఇవేమీ విపక్షాల ఐక్యతను దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.
” మేం ఐకమత్యంగా ముందుకు సాగుతాం. నితీశ్ కుమార్, అఖిలేశ్, హేమంత్ సొరెన్ వంటి నేతలతో కలిసి ఐక్యంగా భాజపాపై పోరాడతాం. రాజకీయం అంటేనే యుద్ధ రంగం. 34 ఏళ్లుగా ఇందులో పోరాడుతున్నాం. ఝార్ఖండ్‌లో ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేద్దామని భాజపా చేసిన ప్రయత్నాలను మేం అడ్డుకున్నాం. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అక్కడి ప్రభుత్వాన్ని కాపాడాం. ” -మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
నితీశ్ పోరు
భాజపాతో సంబంధాలు తెంచుకున్న తర్వాత నితీశ్ కుమార్ పలువురు విపక్ష నేతలతో సమావేశమవుతున్నారు. దిల్లీలో పర్యటించిన నితీశ్ కుమార్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. తొలుత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసిన నితీశ్ ఆ మరుసటి రోజే సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు.
ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ కుమార్ నిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో ఆయన ఈ మేరకు స్పందించారు.
” నేనేమీ ఆ (ప్రధాని) పదవికి హక్కుదారుడ్ని కాదు. కనీసం ఆ కోరిక కూడా నాకు లేదు. వామపక్ష పార్టీలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఏకతాటిపైకి వస్తే అదో పెద్ద విషయం అవుతుంది. ” -నితీశ్ కుమార్, బిహార్ సీఎం Also Read: Viral News: ఏ నిమిషానికి ఏమి జరుగునో- స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్!
Also Read: Vietnam Fire Accident: బార్లో చెలరేగిన మంటలు- 33 మంది సజీవదహనం!