Hyderabad Rains : హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వర్షపు నీరు రోడ్లపై చేరుతోంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, హైటెక్‌సిటీ, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, చైతన్యపురి, అంబర్పేట్, ముసారాంబాగ్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పలుచోట్ల మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, డీజీపీ ఆఫీస్ నుండి లక్డీ-కా పూల్ వైపు ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
pic.twitter.com/ukXZI55HCV
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 8, 2022
Date: 08-09-2022 at 1506 hrs :Movement of traffic is slow from Public Garden, Assembly, DGP office towards Lakdi -ka Pool due to Water Login. Commuters are requested to take alternate route to reach destination on time. pic.twitter.com/dbCFbyev4Q
— Hyderabad Traffic Police (@HYDTP) September 8, 2022
ఏపీలో వర్షాలు
తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వెంబడి అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో శనివారం వరకు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది.
Weather briefing on a low pressure formed over West Central Bay of Bengal dated 08.09 2022.Meteorological centre Amaravati pic.twitter.com/MbEU9184WU
— MC Amaravati (@AmaravatiMc) September 8, 2022
Also Read : తెగిపోయిన జమ్మలమడుగు, ముద్దనూరు డైవర్షన్ రోడ్డు!
Also Read : వచ్చే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు! ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ జారీ: IMD