Latest Posts

‘సత్యప్రియ జయదేవ్’ గా ఆకట్టుకుంటున్న నయన్, అక్టోబర్‌లో ’గాడ్ ఫాదర్’ రిలీజ్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన లూసిఫర్ సినిమాను తెలుగులో మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ గా తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా తెలుగులో అనువాదమై విడుదలైనా.. మరికొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదలైంది. అభిమానులు చిరు లుక్ కు చూసి సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్.. సినిమా మీద అంచనాలను ఓ రేంజిలో పెంచేసింది. ఈ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపించారు.

సత్యప్రియ జయదేవ్ గా నయనతార

ఈ సినిమాలో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ యనతార ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.  చిత్రంలో నయనతారను ‘సత్యప్రియ జై దేవ్’ గా పరిచయం చేశారు. ఈ సినిమాలో గాడ్ ఫాదర్ పాత్రను అసహ్యించుకొనే క్యారెక్టర్ లో నయనతార కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నయనతార సీరియస్ లుక్ లో ఆకట్టుకునేలా ఉన్నారు. నయనతార లైనింగ్ చెక్స్ చీర కట్టుకుని టేబుల్ లాంప్ దగ్గర కూర్చుని ఏవో డాక్యుమెంట్స్ టైప్ చేస్తున్నట్లుగా కనిపించారు. గాడ్ ఫాదర్ లో నయనతార లుక్ చూసి ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Introducing Lady Superstar #Nayanthara as ‘Sathyapriya Jaidev’ from the world of #GodFather ❤️‍🔥First Single update soon🔥GRAND RELEASE ON OCT 5Megastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja @ActorSatyaDev @MusicThaman @LakshmiBhupal @AlwaysRamCharan @ProducerNVP pic.twitter.com/XEcTktasSj

— Konidela Pro Company (@KonidelaPro) September 8, 2022

చిరంజీవి చెల్లిగా నయన్?

మెగాస్టార్ చిరంజీవి-మోహన్ రాజా కలయికలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆచార్య సినిమాతో ఆకట్టుకోని చిరంజీవిని..  ‘గాడ్ ఫాదర్’తో అదుర్స్ అనేలా చూపించేందుకు మోహన్ రాజా ప్రయత్నిస్తున్నారట. అంతేకాదు..  నయనతార, సల్మాన్ ఖాన్, సత్య దేవ్ లాంటి స్టార్ యాక్టర్స్ తో ఈ సినిమా మరింత కలర్ ఫుల్ గా ఉండబోతుందట. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ చిరుకి బాడీ గార్డ్ గా, నయనతార చిరు చెల్లెలిగా కనిపించబోతుందట. ఈ సినిమాలో నయన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట దర్శకుడు. అయితే, ఇక మోహన్‌లాల్ ఒరిజినల్ ‘లూసీఫర్’  సినిమాలో హీరోయిన్ లేదు. మరి తెలుగులో ఉంటుందా? లేదా? అనేది మాత్రం తెలియదు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారట.  అటు ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి, నయనతార మరోసారి ఈ సినిమాలో నటించబోతున్నారు.

‘గాడ్ ఫాదర్’ విడుదలపై ఫుల్ క్లారిటీ

అటు ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలపై చిత్ర బృందం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ ప్రమోషన్స్ ని ఇప్పటికే సినిమా యూనిట్ మొదలు పెట్టింది.    

మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ‘గాడ్ ఫాదర్’  ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మరోవైపు చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తుండగా..  బాబీ డైరెక్షన్‌ లో ఇంకో సినిమాకు కమిట్ అయ్యారు. ఇప్పటికే ‘భోళా శంకర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్‌ లోగా ఈ సినిమా షూటటింగ్ అయిపోనుంది. అనంతరం బాబీ సినిమా పట్టాలెక్కనుంది.

Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం – మణిరత్నం తీసిన విజువల్ వండర్, ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్

Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం – మణిరత్నం తీసిన విజువల్ వండర్, ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్

Latest Posts

Don't Miss