Latest Posts

రూమర్స్, రూమర్స్, RIP రూమర్స్ – బాయ్ చెప్పి, మళ్లీ ట్విట్టర్‌లోకి వచ్చిన ఛార్మి, ఎందుకంటే..

‘లైగర్’ మూవీ తప్పకుండా హిట్ కొడుతుందని దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ కౌర్‌లు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఫస్ట్ డే వచ్చినంత కలెక్షన్లు సెకండ్ డే నుంచి రాలేదు. సినిమాపై వచ్చిన నెగటివ్ పబ్లిసిటీ కూడా ఇందుకు కారణం. అయితే, ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కేవలం పూరీ జగన్నాథ్ టేకింగ్ మాత్రమే ఎందుకో ఆకట్టుకోలేకపోయింది. అయితే, ‘లైగర్’ రిలీజ్ కాకముందే ఛార్మీ టీమ్ ‘జన గణ మన’ (JGM) మూవీ, ఫస్ట్ లుక్, ప్రోమోలు విడుదల చేసి హైప్ క్రియేట్ చేశారు. ‘లైగర్’ ఫలితం వల్ల ‘జేజీఎం’ సినిమాను ఆపేశారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఛార్మి, పూరీ జగన్నాథ్‌లు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆ సినిమా ఉండబోదనే నిర్ణయానికి ప్రేక్షకులు వచ్చేశారు. పైగా, ఛార్మీ కూడా సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటించడంతో అదే నిజం కాబోలని భావిస్తున్నారు. 

రూమర్స్.. రూమర్స్.. RIP రూమర్స్!

అటు పూరి, ఛార్మి మీద కూడా చాలా వార్తలు వచ్చాయి. ముంబై లో అద్దె కట్టలేక హైదరాబాద్ కు వచ్చారనే గాసిప్స్ హల్ చల్ చేశాయి. లైగర్ మూవీ షూటింగ్ నుంచి వీళ్లు ముంబైలోనే ఎక్కువగా ఉన్నారు. సినిమా షూటింగ్ కూడా అక్కడే ఎక్కువగా జరిగింది. ముంబైలో అరేబియ సముద్రం కనిపించేలా ఉన్న ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ లో  పూరి, ఛార్మి ఉన్నారని.. దాని రెంట్ నెలకు రూ.10 లక్షలు అని వార్తలు వచ్చాయి. లైగర్ ఫ్లాప్ తో అద్దె కట్టలేక హైదరాబాద్  కు షిఫ్ట్ అయ్యారని గాసిప్స్ వచ్చాయి. అటు పూరి తర్వాత ప్రాజెక్టు, ఆర్థిక పరిస్థితులు, లైగర్ సెటిల్మెంట్స్ సహా పలు విషయాల గురించి చాలా వార్తలు వచ్చాయి. ఇవన్నీ చిరాకు కలిగించడంతో ట్విట్టర్ వేదిగా ఛార్మి వివరణ ఇచ్చారు. ప్రచారం అవుతున్న రూమర్స్ అన్ని ఫేక్ అని కొట్టిపారేశారు.  పూరి కనెక్ట్స్ బ్యానర్ డెవలప్మెంట్ పై పని చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.

Rumours rumours rumours! All rumours are fake! Just focusing on the progress of 𝐏𝐂 ..Meanwhile, RIP rumours !!

— Charmme Kaur (@Charmmeofficial) September 8, 2022

ట్విట్టర్ కు ఛార్మి బ్రేక్

కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ఛార్మి వెల్లడించారు.  “చిల్ గాయ్స్! సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. పూరీ కనెక్ట్స్ తో  మళ్లీ పెద్ద విషయంతో తిరిగి వస్తా. అప్పటి వరకు బతకండి, బతకనివ్వండి” అని ప్రకటించారు.  

విరామానికి కారణం!

ఛార్మి చేసిన  ప్రకటనతో సినీ అభిమానులు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియా నుంచి ఛార్మి ఎందుకు  విరామం తీసుకున్నారు? అని ఆలోచించారు. ఛార్మికి ప్రస్తుతం ట్విట్టర్ లో ఆరున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఛార్మి సన్నిహితులు మాత్రం ఆమె ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటం వల్లే సోషల్ మీడియాకు విరామం ప్రకటించారని వెల్లడించారు.  తాజాగా ఆమె నిర్మాతగా వ్యవహరించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం పొందింది. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లోనూ డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతగా కోలుకోలేని దెబ్బ తిన్నారు. అయినా  విజయ్ దేవరకొండతో కలిసి పూరి జగన్నాథ్ ‘జన గణ మన‘ అనే సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నందునే ఛార్మీ సోషల్ మీడియాకు విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఛార్మి ఓసారి ట్విట్టర్ కు విరామం ప్రకటించారు. లైగర్ సినిమా ప్రారంభం సమయంలో కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. 

Also Read: ‘క్యాష్‌’లో అలియా భట్‌కు శ్రీమంతం, రణ్‌బీర్‌పై సుమ పంచ్‌లు

Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం – మణిరత్నం తీసిన విజువల్ వండర్, ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్ 

Latest Posts

Don't Miss