Latest Posts

యంగ్ హీరో సినిమాకి పవన్ కళ్యాణ్ సపోర్ట్!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ‘SR కళ్యాణమండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘రాజావారి రాణిగారు’, ‘ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు.

ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన కిరణ్ అబ్బవరం ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ ట్రైలర్ విషయానికొస్తే.. లవ్ స్టోరీ, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ తో నింపేశారు. ఓ వర్గం ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 

విడుదల వాయిదా: ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అదే రోజున బాలీవుడ్ భారీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ విడుదల కానుండడంతో.. ఆ సినిమాకి పోటీగా కిరణ్ అబ్బవరం తన సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ పోటీ నుంచి కిరణ్ అబ్బవరం తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 16కి సినిమాని వాయిదా వేశారు. ‘డేట్ మారుతుంది అంతే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. 

ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్య‌ గమిడి – శ‌రత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియ‌ల్, స‌హ నిర్మాత‌: బాబు, సంగీతం: చైత‌న్ భరద్వాజ్.

Also Read: ‘క్యాష్‌’లో అలియా భట్‌కు శ్రీమంతం, రణ్‌బీర్‌పై సుమ పంచ్‌లు

Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం – మణిరత్నం తీసిన విజువల్ వండర్, ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్ 

          View this post on Instagram                       A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

Latest Posts

Don't Miss