Latest Posts

పెట్రోలు రేట్లకు మళ్లీ రెక్కలొస్తున్నాయ్‌, మీ ఏరియాలో ధర ఇదే!

Petrol-Diesel Price, 9 September: చమురు ధరలు ఇవాళ పెరిగాయి. అయితే, ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి సమీపంలో ట్రేడవుతున్నాయి. చైనాలో కొవిడ్‌ లాక్‌డౌన్ ఆంక్షలు పొడిగింపు, ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల మందగమనం ఇంధన డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్న ఆందోళనలు పెరిగాయి. ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.93 డాలర్లు పెరిగి 83.56 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.33 డాలర్లు పెరిగి 89.11 డాలర్లకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (గురువారం) పోలిస్తే ఇవాళ (శుక్రవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 109.10 గా ఉంటే, ఇవాళ ₹ 109.28 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 97.29 వద్ద ఉండగా, ఇవాళ ₹ 97.46 రేటు వద్ద ఉంది.వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.47 గా ఉండగా, ఇవాళ ₹ 109.32 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.63 గా ఉండగా, ఇవాళ ₹ 97.50 గా నిర్ణయమైంది.నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.27 గా ఉండగా, ఇవాళ ₹ 111.73 వద్ద ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.31 గా ఉండగా, ఇవాళ ₹ 99.75 కి చేరింది.నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.24 గా ఉండగా, ఇవాళ ₹ 109.57 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.41 కాగా, ఇవాళ ₹ 97.72 వద్ద ఉంది.కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.32 గా ఉండగా, ఇవాళ ₹ 109.78 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా ఇవాళ ₹ 97.92 గా నమోదైంది.ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.67 గా ఉండగా, ఇవాళ ₹ 111.83 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.69 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.84 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.01 గా ఉండగా, ఇవాళ ₹ 112.20 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.74  గా ఉండగా, ఇవాళ ₹ 99.92 రేటు ఉంది.గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.80 గా ఉండగా, ఇవాళ ₹ 112.01 దగ్గర ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.53 నుంచి ఇవాళ ₹ 99.74 వద్దకు చేరింది.రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 110.96 గా ఉంటే, ఇవాళ ₹ 111.86 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.75 గా ఉండగా, ఇవాళ ₹ 99.59 గా కొనసాగుతోంది.విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 111.28 నుంచి ఇవాళ ₹ 110.48 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.01 గా ఉండగా, ఇవాళ ₹ 98.27 గా నమోదైంది. తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.98 గా ఉండగా, ఇవాళ ₹ 112.33 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.69 గా ఉండగా, ఇవాళ ₹ 99.91 కి చేరింది.కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.51 గా ఉంటే ఇవాళ ₹ 111.63 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.27 నుంచి ఇవాళ ₹ 99.37 వద్ద ఉంది.అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.73 గా ఉంటే, ఇవాళ ₹ 111.89 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.48 గా ఉండగా, ఇవాళ ₹ 99.63 గా నమోదైంది.

Latest Posts

Don't Miss