Covid Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 6,395 మందికి కరోనా సోకింది. 33 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా 6,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.7కు పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసులు: 4,44,72,241 యాక్టివ్ కేసులు: 50,342 మొత్తం మరణాలు: 5,28,090 మొత్తం రికవరీలు: 4,39,00,204 వ్యాక్సినేషన్
Koo App ▪️India’s Cumulative COVID-19 Vaccination Coverage exceeds 214.27 Cr ▪️Over 4.05 Cr 1st dose vaccines administered for age group 12-14 years ▪️India’s Active caseload currently stands at 50,342 Read here: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1857689 #IndiaFightsCorona View attached media content – PIB India (@PIB_India) 8 Sep 2022
దేశంలో కొత్తగా 36,31,977 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 214.27 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,25,602 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కీలక నిర్ణయం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్ టీకా (బీబీవి154/నాసల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు.
” కరోనాపై యుద్ధంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్ టీకా (బీబీవి154/నాసల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకా ఇవ్వొచ్చు. ” -మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి ఒక్కసారి చాలు
భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ‘BBV154’గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నాసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: Amit Shah Mumbai visit: అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం- ఆంధ్రా ఎంపీ సెక్రటరీ అరెస్ట్!
Also Read: Bharat jodo Yatra : మనందరం భారత్‌ను ఏకం చేద్దాం – పాదయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ పిలుపు
Also Read: Bharat jodo Yatra : మనందరం భారత్‌ను ఏకం చేద్దాం – పాదయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ పిలుపు