Latest Posts

తగ్గాలి, తగ్గాలి అనుకుంటే బంగారం, వెండి రేట్లు ఇంత భారీగా తగ్గాయేంటి?

Gold-Silver Price 8 September 2022: దేశంలో బంగారం ధర (Today’s Gold Rate) నిన్నటితో (బుధవారం) పోలిస్తే నేడు (గురువారం) తగ్గింది. 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ₹ 500, స్వచ్ఛమైన పసిడి ₹ 540 దిగి వచ్చింది. కిలో వెండి ధర ₹ 1,100 తగ్గింది.

తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ (గురువారం) ₹ 46,400 కి దిగి వచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹ 50,620 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 58,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు (గురువారం) ₹ 46,400 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 50,620 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 58,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో.. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, కిలో వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Cities) చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 46,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,220 కి చేరింది.ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,620 కి చేరింది.దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,550 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,770 గా నమోదైంది.బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,450 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,670 గా ఉంది. మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,450 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,670 గా ఉంది. పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,430 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,650 గా ఉంది. 

ప్లాటినం ధర (Today’s Platinum Rate)సంపన్నులు బాగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం ‘ప్లాటినం’ ధర నిన్నటితో (బుధవారం) పోలిస్తే నేడు (గురువారం) పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాములకు ₹ 440 పెరిగి ₹ 21,900 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ధరల్లో మార్పులు ఎందుకు?పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక రకాల పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Latest Posts

Don't Miss