Latest Posts

గుప్పెడంతమనసు సెప్టెంబరు 8 ఎపిసోడ్: రిషిని ఆలోచనలో పడేసిన జగతి మాటలు, సంబరం చేద్దామన్న వసు

గుప్పెడంత మనసు గురువారంఎపిసోడ్  ( Guppedantha Manasu September 8 Today Episode 550)

గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి-వసు ఒక్కటయ్యాడు. అది చూసిన దేవయాని రగిలిపోతుంటుంది. బయటకు మాత్రం తనేదో మారిపోయినట్టు నటిస్తుంది. వసుధారపై కోపం వచ్చేలా చేయాలని స్కెచ్చేసిన దేవయాని ఇందులో జగతి-మహేంద్ర పెళ్లిరోజుని వాడుకోవాలని ఫిక్సైంది. ఇందులో భాగంగా రెస్టారెంట్ కి వెళ్లి వసుధారని స్వయంగా కలసి వాళ్ల పెళ్లిరోజు ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను..ఇందుకు రిషిని నువ్వే ఒప్పించాలని చెబుతుంది. జగతి పేరెత్తితేనే రిషి మండిపడతాడు కాబట్టి ఆ సంఘటన ద్వారా వసుపై కోపం పెంచుకుంటాడని ఈ ప్లాన్ వేస్తుంది దేవయాని.ఆ తర్వాత వాళ్లద్దరికీ రొమాంటిక్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు గౌతమ్. ఇద్దరూ మొదట షాక అయినా..ఆ డిన్నర్ ని, ఆటైమ్ ని ఆస్వాదిస్తారు. ఇక ఈ రోజు( సెప్టెంబరు 8) గురువారం ఎపిసోడ్ లో కూడా జగతి-మహేంద్ర పెళ్లిరోజు సెలబ్రేషన్స్ చుట్టూనే నడిచింది.   

సెలబ్రేషన్ కి, సంబరానికి వసు ఇచ్చిన క్లారిటీ రిషిని ఒప్పిస్తుందా ? #StarMaaSerials #GuppedanthaManasu | Mon to Sat at 7.00 pm #StarMaa. pic.twitter.com/xXvqzpJ2Hr

— starmaa (@StarMaa) September 8, 2022

రూమ్ లో కూర్చుని తమ పెళ్లిరోజు గురించి మాట్లాడుకుంటారు మహేంద్ర-జగతి. అదే సమయంలో అక్కడకు వెళ్లిన రిషి డోర్ కొట్టబోతూ ఆగిపోగి జగతి మాటలు వింటాడు. జగతి ఏమంటుందంటే…’మహేంద్ర మనం పెళ్లిరోజు జరుపుకుంటే రిషి మనసు బాధపడుతుంది..రిషిని బాధించే సంతోషం మనకు అవసరమా’ అంటుంది. ఆ మాటలు విన్న రిషి లోపలకు వెళ్లకుండా అట్నుంచి అటే బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుధారను కలవడంతో…దేవయాని చెప్పినట్టు రిషిని ఒప్పించే పనిలో పడుతుంది వసుధార. ‘వాళ్లు మ్యారేజ్ డే చేసుకుంటే సెలబ్రేషన్ అవుతుంది..అదే మీరు చేస్తే సంబరం అవుతుంది సార్’  అని చెబుతుంది. అటు జగతి మాటలు విన్న రిషి, ఇటు వసుధార చెప్పింది కూడా విన్నాక ఆలోచనలో పడతాడు.

Also Read:  రిషిధార రొమాంటిక్ డిన్నర్, కండిషన్స్ అప్లై అన్న ఈగో మాస్టర్

జగతి-మహేంద్ర పెళ్లిరోజుని రిషి సెలబ్రేట్ చేయడం అంటూ జరిగితే అది దేవయానికి మామూలు షాక్ కాదు. జగతి-మహేంద్ర  ని విడగొట్టాలని చేసిన ప్లాన్స్ వర్కౌట్ అవలేదు. జగతిని ఇంట్లో అడుగుపెట్టకుండా చేద్దామనుకున్నా అదీ జరగలేదు. రిషి అస్సలు జగతిని పట్టించుకోకూడదని ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా…ఇప్పుడిప్పుడే రిషి జగతి విషయంలో కూల్ అవుతున్నాడు. పైగా తనను వదిలివెళ్లిపోయిన విషయం తప్ప మిగిలిన అన్నింటిలో ఇద్దరి ఆలోచనలూ కలుస్తున్నాయన్న రిషి.. వసుధార తన జీవితంలోకి వచ్చేలా చేసినందుకు థ్యాంక్స్ చెబుతాడు. ఇప్పుడు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కూడా ఇంట్లో జరిపిస్తే దేవయానికి గట్టి స్ట్రోక్ తగిలినట్టే. మొత్తానికి ఈగో మాస్టర్ ప్రేమ దక్కించుకున్న వసు…మహేంద్రకి మాటిచ్చినట్టే జగతికి  గురుదక్షిణగా రిషిని ఇస్తుందేమో వెయిట్ అండ్ సీ…

Also Read:  మోనిత తలనొప్పి – దీప బామ్, గతాన్ని గుర్తుచేసుకునే ప్రయత్నంలో డాక్టర్ బాబు

Latest Posts

Don't Miss