Latest Posts

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!

గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) గురువారం (సెప్టెంబరు 8) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అక్టోబరు 14 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Latest Posts

Don't Miss