Latest Posts

ఆ స్టార్ డైరెక్టర్‌తో ఈషా రెబ్బా పెళ్లి?

అందం, అభినయం కలబోసిన తెలుగుంటి అందాల బొమ్మ ఈషా రెబ్బ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇప్పుడు ఈ భామ గురించి ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈషా త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి.  ఆమె ఓ తమిళ స్టార్ డైరెక్టర్‌ను పెళ్లాడబోతున్నట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారట. ఇరువురు తమ పెద్దలకు ప్రేమ సంగతి చెప్పి ఒప్పించినట్టు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే వీళ్ళిద్దరూ కలిసి ఏడడుగులు వేయబోతున్నట్టు తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఈషా ఇంకా స్పందించలేదు. ఈషా పెళ్లాడబోయే ఆ డైరెక్టర్ ఎవరా అని అందరూ తెగ వెతికేస్తున్నారు.

‘అంతక ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది ఈ తెలుగమ్మాయి. నటన పరంగానే కాదు, చూడానికి చక్కగా ముద్దుగా ఉన్నప్పటికీ ఎందుకో ఈషాకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘అ’! సినిమాలో లెస్బియన్ క్యారెక్టర్ చేసి అందరి ప్రశంసలు పొందింది. త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ‘అరవింద సమేత’ సినిమాలోనూ మెరిసింది. హీరోయిన్ గానే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చెయ్యడానికి కూడా ఈషా సిద్ధంగా ఉన్నట్టు గతంలో వెల్లడించింది. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలోనూ నటించింది. తెలుగులో అంతగా అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళంలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు చూస్తుంది. ఇప్పటికే పలు తమిళ సినిమాల్లో ఇషా బిజీగా ఉంది.

ఈషా రెబ్బ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ట్రెడిషనల్ లుక్ లోనే కాదు పొట్టి దుస్తులు ధరించి హాట్ లుక్ లో కూడా తన అందంతో ఫ్యాన్స్‌ను మంత్రముగ్దులను చేస్తుంది ఈ ముద్దు గుమ్మ. ఈషా మలయాళంలో సైతం తన లక్ పరీక్షించుకుంటోంది. ‘ఒట్టు – చాప్టర్ 2’ ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా హిట్ కొడితే.. ఇషా కూడా ఇతర తెలుగమ్మాయిల్లా పరభాషా చిత్రాల్లో సెటిలైపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Also Read: ‘క్యాష్‌’లో అలియా భట్‌కు శ్రీమంతం, రణ్‌బీర్‌పై సుమ పంచ్‌లు

Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం – మణిరత్నం తీసిన విజువల్ వండర్, ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్

          View this post on Instagram                       A post shared by Eesha Rebba (@yourseesha)

Latest Posts

Don't Miss