Latest Posts

అమలా పాల్‌తో పెళ్లి నిజమే, కోర్టులో సాక్ష్యాలు చూపించిన మాజీ బాయ్ ఫ్రెండ్?

మాజీ బాయ్ ఫ్రెండ్ భవ్ నిందర్ సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ..  కొద్ది రోజుల క్రితం నటి అమలాపాల్ తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  తను చెప్పినట్లు చేయకపోతే.. ప్రైవేటుగా తీసుకున్న ఫోటోలను బయట పెడతానని వేధిస్తున్నాడని కంప్లైంట్ లో రాసింది. కేసు నమోదు చేసుకున్న విల్లుపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు..  భవ్ నిందర్ సింగ్ ను అరెస్ట్ చేశారు.  తాజాగా అతడికి  కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టులో ఆయన కీలక ఆధారాలు సమర్పించడం వల్లే బెయిల్ వచ్చిందట. వాస్తవానికి  అమలా పాల్ ఓ పంజాబీ నటుడు, గాయకుడిని పెళ్లి చేసుకుందని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. కానీ, అది పెళ్లి కాదని.. ఓ ప్రమోషనల్ వీడియో షూట్ అని వెల్లడించింది.   

2017లో అమలా పాల్- భవ్ నిందర్ సింగ్ పెళ్లి

కోర్టు వేదికగా సదరు పంజాబీ నటుడు అసలు విషయాన్ని వెల్లడించాడు.  2017లో అమలా పాల్ తో తన పెళ్లి జరిగిందని.. అదీ పంజాబీ సంప్రదాయం ప్రకారం అయ్యిందని వెల్లడించాడు. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కోర్టు ముందు ఉంచాడట. అప్పట్లో బయటకు వచ్చిన ఫోటోలు యాడ్ కోసమో, పాట కోసమో చేసిన షూట్ చేసినవి కాదని చెప్పాడట. నిజంగా పెళ్లి అయ్యిందంటూ పూర్తి ఆధారాలు జడ్జి ముందు పెట్టాడట. తాము అభిప్రాయబేధాల కారణంగానే విడిపోయాం తప్ప.. లీగల్ గా ఇప్పటికీ తాము భార్యాభర్తలమేనని వెల్లడించాడట. తన మీద కోపంతోనే ఆమె లైంగిక ఆరోపణలు చేసిందని చెప్పాడట. కోర్టు అతడి వ్యాఖ్యలతో ఏకీభవించి బెయిల్ ఇచ్చిందట. న్యాయస్థానం సాక్షిగా అమలా పాల్ ఆరోపణలు అవాస్తవం అని తేలిందట. దీంతో అమలా పాల్ ఇంత అబద్దాల కోరా? అంటూ కోలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుందట.

ఆర్థికంగా మోసం చేశాడంటూ ఫిర్యాదు

అటు అమలా పాల్ భవ్ నిందర్ సింగ్ మీద మరో ఆరోపణ చేసింది. తాను హీరోయిన్ గా చేసిన ‘కడావర్’ సినిమాకు భవ్ నిందర్ సింగ్ తో కలిపి నిర్మాతగా వ్యవహరించినట్లు తెలిపింది. ఈ  సినిమా ఆగస్టు 12న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. అయితే, భవ్ నిందర్ తనను ప్రొడక్షన్ కంపెనీ నుంచి తొలగించి నకిలీ పత్రాలతో కంపెనీని తన సొంతం చేసుకున్నాడని కూడా కంప్లైంట్ చేసింది. దానిపై కూడా విచారణ చేసిన పోలీసులు..  కొన్ని పత్రాలను ఫోర్జరీ జరిగినట్లు గుర్తించారట. ప్రస్తుతం అమలాపాల్ ఫిర్యాదు పేర్కొన్న రెండు విషయాలపై విచారణ జరుగుతుందట.

భవ్ నిందర్ సింగ్ కుటుంబం, అమలాపాల్ కలిసి 2018లో ఓ ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. విల్లుపురం జిల్లా కోటకుప్పం సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ సినిమా ప్రొడక్షన్ వర్క్ చేసేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సమయంలో వారిద్దరూ పెళ్లిచేసుకుంటారన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో  తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను బయటపెడతానటూ  భవ్‌ నిందర్ తనను బెదిరిస్తున్నాడంటూ అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్థికంగా తనను మోసం చేశాడని మరో ఫిర్యాదు చేసింది.

Also Read: బిగ్‌బాస్-6 కంటెస్టెంట్‌లా రెమ్యునరేషన్లు ఇవే, అతడు టాప్ – ఆమె లీస్ట్Also Read: ‘బిగ్ బాస్’ సీజన్-6లో ఈసారి గట్టి పోటీయే, ఈ కంటెస్టెంట్లలో మీ ఫేవరెట్ ఎవరు?

Latest Posts

Don't Miss