Latest Posts

Tips For Personal Finance: ఈ 5 టిప్స్ పాటించండి.. కోటిశ్వరులుగా మారండి..!

బడ్జెట్ :

బడ్జెట్ అనేది మీ డబ్బును ఖర్చు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించే ప్రక్రియ. మీ ఖర్చులన్నింటినీ లెక్కించడం ద్వారా మీ ఆదాయంతో మీ ఖర్చులను సమతుల్యం చేసుకునేందుకు వీలుంటుంది. వచ్చే ఆదాయంలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలి. ఏది ఎప్పుడు కొనాలి అనేది కచ్చితంగా బడ్జెట్ ప్రణాళికలో చేర్చుకోవాలి.

ఆదా

ఖర్చు చేస్తూ పోతే చివరికి ఏమి మిగలదు. మీకు వచ్చే ఆదాయంలో కొంత భాగం కచ్చితంగా ఆదా చేయాలి. ఉద్యోగంలో చేరి, చక్కని వేతనం పొందుతున్న యువకులు తాము జీవితాంతం ఆర్థికంగా సురక్షితంగా ఉన్నారనే భావనలో ఉంటారు. ఎక్కువ మంది దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక ఆర్థిక లాభాల కోసం పెట్టుబడి పెట్టడాన్ని మరిచిపోతారు. దీంతో వారు భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

కాపౌండింగ్ వడ్డీ

కాపౌండింగ్ వడ్డీ అనేది ప్రపంచంలో 8వ వింత అని ఐన్ స్టీన్ అన్నారు. కాపౌండింగ్ వడ్డీ గురించి అర్థం చేసుకున్నవారు సంపాదిస్తాడని చెప్పారు. కాంపౌండింగ్ అనేది ప్రాథమికంగా దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం.మీ డబ్బు ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, అది పెరగడానికి ఎక్కువ సమయం ఉంటుంది.

సురక్షితమైన రుణాలు

జీవితంలో కొన్నిసార్లు ఆకస్మిక అవసరాలు వస్తాయి. ఆ సమయాల్లో మన వద్ద డబ్బు లేకుంటే అప్పు చేస్తాం. లేదా బ్యాంకు లోన్ తీసుకుంటాం. అయితే లోన్ తీసుకునేటప్పుడు ఏ బ్యాంకు తక్కువ వడ్డీ తీసుకుంటుందో ఆ బ్యాంకులో లోన్ తీసుకోవాలి. ఒకవేళ మీ వద్ద బంగారం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప పర్సనల్ లోన్ తీసుకొవద్దని నిపుణులు చెబుతున్నారు. దీనిపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందట.

నిపుణులను సంప్రదించండి

చాలా మందికి డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియదు. అలాంటి వారు నిపుణులను సంప్రదించి పెట్టుబడి పెడితే మంచిది. ఆర్థిక సలహాదారులతో మాట్లాడి మీ అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి. మీరు ప్రస్తుతం జీవితంలో ఏ దశలో ఉన్నా కచ్చితమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్లడం ఉత్తమమైన మార్గం.

Latest Posts

Don't Miss