Latest Posts

Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్.. అలుముకున్న ఆర్థిక మాంద్యం భయాలు

నష్టాల్లోని స్టాక్ లు

మారుతి, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, జేడబ్ల్యూఎస్ స్టీల్, డా. రెడ్డీస్, ఐచర్ మోటర్స్, బీపీసీఎల్, టాటా మోటర్స్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిసి, హెచ్ డిఎఫ్ సీ లిమిటెడ్, హెచ్ సీఎల్ టెక్నాలజీ, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, హీరో మోటో కార్ప్, హెచ్ డి ఎఫ్ సీ లైఫ్, కొటాక్, హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకు, హిందుల్కో, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకు నష్టల్లో ట్రేడ్ అవుతున్నాయి.

అమెరికా సూచీలు

అదానీఈఎన్టీ, ఎన్టీపీసీ, ఏసియన్ పెయింట్స్, కోల్ ఇండియా, యూపీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల మార్కెట్ నష్టాల్లో కొనసాగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా సూచీలు మంగళవారం నష్టపోవడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై పడిందన్నారు.

లాభాల్లో మిడ్, స్మాల్ క్యాప్

ఆసియా-పసిఫిక్‌ సూచీలు ఈరోజు నష్టాలతో ఉండడం కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలోనే సూచీలు అప్రమత్తంగా చలిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.11 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ 0.25 శాతం పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 0.68 శాతం నష్టంలో ఉంది.

Latest Posts

Don't Miss