రూ.117
“ఈ షేరు గత 18 నెలల శ్రేణి (రూ.104-66) కంటే ఎక్కువ బ్రేక్అవుట్ను ఉత్పత్తి చేసే దశలో ఉందని వివరించింది. తద్వారా కొత్త ప్రవేశ అవకాశాన్ని అందిస్తోందని.. ఇటీవలి కన్సాలిడేషన్ ఆధారంగా 20 నెలల EMA వద్ద ఉందని తెలిపింది. దాదాపు మూడు నెలల కాలపరిమితితో రూ.117 స్థాయిల (టార్గెట్ ధర) వైపు వెళ్తుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది.
ప్రభుత్వ వాటా 75 శాతం
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) ప్రముఖ ఎరువులు, రసాయనాల తయారీ సంస్థగా ఉంది. దీనిలో భారత ప్రభుత్వం 75% వాటా కలిగి ఉంది. సంస్థ 1997లో ‘మినీరత్న’ హోదాను పొందింది. దీనికి రెండు ఆపరేటింగ్ యూనిట్లు ఉన్నాయి. ఒకటి ముంబైలోని ట్రాంబేలో, మరొకటి రాయ్‌గఢ్ జిల్లా వద్ద ఉంది.
ప్రస్తుతం రూ.102.80
RCF యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, బయో-ఎరువులు, సూక్ష్మ పోషకాలు, నీటిలో కరిగే ఎరువులు, మట్టి కండీషనర్లు మరియు అనేక రకాల పారిశ్రామిక రసాయనాలను తయారు చేస్తుంది. బుధవారం నాటికి ఆర్సీఎఫ్ షేరు ధర రూ.102.80 వద్ద. కాగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ దీనికి టార్గెట్ ప్రైస్ రూ.117 గా అంచనా వేస్తోంది.
note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిలు రిస్క్ తో కూడకున్నవి.