For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, September 7, 2022, 10:59 [IST]
ఆర్బీఐ పలు బ్యాంకులపై కొరడా ఝలిపించింది. నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంది. 5 సహకార బ్యాంకులకు జరిమానా విధించింది. నిర్లక్ష్యంగా ఉన్నందుకు చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కర్ణాటక స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు రూ. 25 లక్షల ఫైన్ విధించింది.
వినియోగదారుడికి లావాదేవీల్లో అసౌకర్యం కలిగించినందుకు మహారాష్ట్రలోని థానేలో ఉన్న భారత్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ కు ఆర్బీఐ రూ.15 లక్షల జరిమానా విధించింది. ఝాన్సీలో ఉన్న రాణి లక్ష్మీబాయి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు రూ. 5 లక్షలు, తమిళనాడులోని తంజోర్‌లోని నికల్సన్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌పై రూ. 2 లక్షలు, ది అర్బన్ కో-పై రూ. 10,000 ఫైన్ వేసినట్లు ప్రకటించింది.
ఆర్బీఐ గతంలో కూడా 8 సహకార బ్యాంకులపై RBI జరిమానా విధించింది. ఈ విశాఖపట్నానికి చెందిన సహకార బ్యాంకుకు గరిష్టంగా రూ.55 లక్షల ఫైన్ విధించింది. ఆర్బిఐ దేశంలోని సహకార, ఇతర బ్యాంకులపై నిఘా ఉంచుతుంది. బ్యాంకుల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యులు తీసుకుంటుంది.
English summary
RBI Imposed penality on 5 co-operative banks in India
RBI Actions have been taken against banks that do not follow the rules. 5 co-operative banks have been fined.
Story first published: Wednesday, September 7, 2022, 10:59 [IST]