Latest Posts

Rashi Khanna: హొయలుపోతున్న ఢిల్లీ సోయగం

హోమ్ ఫోటో గ్యాలరీ &nbsp/ ఎంటర్‌టైన్‌మెంట్‌ Rashi Khanna: హొయలుపోతున్న ఢిల్లీ సోయగం By : Desam | Updated: 07 Sep 2022 07:29 PM (IST)

తక్కువ సమయంలో తెలుగుతో పాటు చాలా దక్షిణాది, ఉత్తరాది భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి ఖన్నా. అందమైన నవ్వు.. అద్భుతమైన అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

అనుకోకుండా మోడలింగ్‌లోకి వచ్చి.. అక్కడ్నుంచి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. సినిమాల్లోకి రాకముందు చాలా అడ్వర్‌టైజ్మెంట్స్‌లో నటించింది రాశి. (Image courtesy – @raashiikhanna/Instagram)

మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా పరిచయం అయింది రాశి. అందులో హీరో జాన్ అబ్రహం భార్యగా నటించింది. ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమా కూడా విజయం సాధించడంతో రాశి స్టార్ అయిపోయింది.(Image courtesy – @raashiikhanna/Instagram)

తెలుగు సినిమాల్లోకి 2013లో ఎంట్రీ ఇచ్చింది రాశి. ఊహలు గుసగుసలాడే సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత అక్కినేని వారి మనం సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత వరసగా హీరోయిన్ పాత్రలు ఈమె కోసం క్యూ కట్టాయి. వరస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ.(Image courtesy – @raashiikhanna/Instagram)

ఈ మధ్య తెలుగు కంటే ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలపై ఫోకస్ పెడుతుంది రాశి ఖన్నా. (Image courtesy – @raashiikhanna/Instagram)

గ్లామర్ షో విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది రాశి. తనకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు కావాలని.. కానీ కొందరు గ్లామరస్ పాత్రలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ తాను మాత్రం గ్లామర్ షోలో హద్దుల్లోనే ఉంటానని చెప్పింది. (Image courtesy – @raashiikhanna/Instagram)

ప్రస్తుతం పలు తెలుగు, తమిళ సినిమాలు చేస్తుంది. (Image courtesy – @raashiikhanna/Instagram)

Tags: Rashi Khanna latest Photos Tollywood Heroine

Latest Posts

Don't Miss