For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, September 7, 2022, 15:05 [IST]
హెచ్డీఎఫ్సీ తన రుణగ్రహీతలకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ని 10 బేసిస్ పాయింట్లకు (bps) పెంచింది. పెంచిన రేటు 7 సెప్టెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చింది. MCLR రేటు పెంపుతో గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర రుణాల కోసం సమానమైన నెలవారీ వాయిదాలు (EMIలు) ప్రభావం పడుతోంది.
గత నెలలో కూడా పెంపు.. ఈ పెంపుతో HDFC బ్యాంక్ MCLR 8.2 శాతానికి పెరిగింది. గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వివిధ కాల వ్యవధిలో ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ల మార్జినల్ కాస్ట్‌ను 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. MCLR ఏప్రిల్ 2016లో తీసుకొచ్చారు. దీనిలో బ్యాంకులు తమ నిధుల వ్యయాన్ని లెక్కించేందుకు ఒక ఫార్ములా ఇచ్చారు. ప్రతి బ్యాంకు తన MCLRని నిధుల సమీకరణ ఖర్చు, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
ఆర్బీఐ గత నెలలో ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ రెపో రేటు పెంచింది. ఈ రెపో రేటు పెంపుతో రుణగ్రాహితల ఈఎంఐ పెరుగుతుంది.
English summary
HDFC has increased the interest rates on loans, the increased rates are effective from today
HDFC Bank has hiked its Marginal Cost of Funds Based Lending Rate (MCLR) across all tenors for borrowers 10 basis points (bps) with effect from today, 7 September 2022. One basis point is one-hundredth of a percentage point.
Story first published: Wednesday, September 7, 2022, 15:05 [IST]