నెల్లూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడి పర్యటన ఖరారు
14న కోవూరు నియోజకవర్గంలో మినీ మహానాడు
15న నెల్లూరులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్ష
16న వెంకటగిరి, శ్రీకాళహస్తిలో బాదుడే బాదుడు ర్యాలీలు
కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద మినీ మహానాడుకు స్థల పరిశీలన చేసిన సందర్భంగా మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మిని మహానాడులు
14న కోవూరు నియోజకవర్గంలో జరిగే మినీ మాహానాడుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారు
15న ఉదయం నుంచి సాయంత్రం వరకు నెల్లూరులో జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల సమీక్ష జరుగుతుంది
16న వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు రోడ్ షో లో పాల్గొంటారు
రేపు కావలికి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు వస్తున్నారు..వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన దుగ్గిరాల కరుణాకర్ కుటుంబసభ్యులను ముసునూరులో పరామర్శిస్తారు
త్వరలోనే ఉదయగిరి నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మరోమారు నెల్లూరుకు లోకేష్ బాబు వస్తారు
సోమిరెడ్డి వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కంభం విజయరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, చెముకుల క్రిష్ణచైతన్య, కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, దొడ్డపనేని రాజానాయుడు, కువ్వారపు బాలాజీ, సాబీర్ ఖాన్ తదితరులు