For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, September 7, 2022, 7:31 [IST]
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 91.90 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 85.83 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఇదివరకు ఈ ధర 94-95, వెస్ట్ టెక్సాస్‌లో 88-90 డాలర్ల వరకు ఉండేది.
క్రూడాయిల్ రేట్లు భారీగా తగ్గినప్పటికీ- కేంద్రప్రభుత్వం మాత్రం వాహనదారులకు ఎలాంటి ఊరట కల్పించట్లేదు. 100 డాలర్ల దిగువకు క్రూడ్ రేట్లు చేరితే సాధారణంగా ఇంధన ధరలను తగ్గించడం ఆనవాయితీగా భావిస్తుంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. చాలారోజులుగా వంద డాలర్లకు దిగువనే బ్యారెల్ ధర కొనసాగుతున్నా కేంద్రం మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించడంపై దృష్టి సారించట్లేదు.
ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ఇవ్వాళ్టి కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.
కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.
అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్‌ను తగ్గించింది.
English summary
Fuel rates on September 7, 2022: After Crude Oil falling petrol and diesel rates remain unchanged,
Fuel rates on September 7, 2022: After Crude Oil falling petrol and diesel rates remain unchanged,
Story first published: Wednesday, September 7, 2022, 7:31 [IST]