Latest Posts

ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో పెట్రో రేట్లు ఢమాల్‌ – మీ సిటీలో ఎంత తగ్గిందో తెలుసా?

Petrol-Diesel Price, 8 September: ఉత్పత్తి తగ్గితే సప్లై కూడా తగ్గి వస్తువు ధర పెరగాలి కదా?. అదేం విచిత్రమో.. ముడి చమురు విషయంలో సీన్‌ రివర్స్‌లో ఉంది. ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిలో కోతను ప్రకటించినా, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఇవాళ కూడా భారీగా, బ్యారెల్‌కు $3 పైనే తగ్గాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కంటే ముందున్న స్థాయికి, ఏడు నెలల కనిష్టానికి రేట్లు పడిపోయాయి. ఆర్థిక మాంద్యం భయాలు, చైనాలో నిరాశాజనక ఆర్థిక డేటా ఇందుకు కారణాలు. ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 3.42 డాలర్లు తగ్గి 83.46 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 3.40 డాలర్లు తగ్గి 89.43 డాలర్లకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (బుధవారం) పోలిస్తే ఇవాళ (గురువారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ఇంధన ధరలు కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో లీటరు పెట్రోల్ ధర నేడు ₹ 109.10 గా ఉంది. లీటరు డీజిల్ ధర ₹ 97.29 వద్ద నిలకడగా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.31 గా ఉండగా, ఇవాళ ₹ 109.47 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.49 గా ఉండగా, ఇవాళ ₹ 97.63 రేటు ఉంది.నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.73 గా ఉండగా, ఇవాళ ₹ 111.27 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.75 గా ఉండగా, ఇవాళ ₹ 99.31 కి చేరింది.నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.57 గా ఉండగా, ఇవాళ ₹ 109.24 గా కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.72 కాగా, ఇవాళ ₹ 97.41 వద్ద ఉంది.కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.47 గా ఉండగా, ఇవాళ ₹ 109.32 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.63 గా ఉండగా ఇవాళ ₹ 97.50 గా నమోదైంది.ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.94 గా ఉండగా, ఇవాళ ₹ 111.67 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.94 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.69 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న (బుధవారం) ₹ 112.01 గా ఉండగా ఇవాళ (గురువారం) కూడా ₹ 112.01 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.74  గా ఉండగా, ఇవాళ కూడా ఇదే రేటు ఉంది.గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.05 గా ఉండగా, ఇవాళ ₹ 111.80 వద్దకు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.75 నుంచి ఇవాళ ₹ 99.53 వద్ద ఉంది.రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.17 గా ఉంటే, ఇవాళ ₹ 110.96 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.94 గా ఉండగా, ఇవాళ ₹ 98.75 గా కొనసాగుతోంది.విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.48 నుంచి ఇవాళ ₹ 111.28 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.27 గా ఉండగా, ఇవాళ ₹ 99.01 గా నమోదైంది. తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.55 గా ఉండగా, ఇవాళ ₹ 111.98 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 100.19 గా ఉండగా, ఇవాళ ₹ 99.69 కి చేరింది.కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 112.03 గా ఉంటే ఇవాళ ₹ 111.51 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.76 నుంచి ఇవాళ ₹ 99.27 కు వద్ద ఉంది.అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.66 గా ఉంటే, ఇవాళ ₹ 111.73 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.42 గా ఉండగా, ఇవాళ ₹ 99.48 గా నమోదైంది.

Latest Posts

Don't Miss