ఎటైనా పారిపోయి.. మీ బాధలు మరచిపోవాలని ఎప్పుడైనా అనిపించిందా?

లైఫ్​లో అంతా గజిబిజిగా ఉన్నప్పుడు.. ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో.. ఎటూ చూసినా నెగిటివ్​ తప్పా.. ఒక్క పాజిటివ్ హోప్​ కూడా కనిపించనప్పుడు.. బిజీలైఫ్​ని లీడ్​ చేస్తున్నప్పుడు.. ఎక్కడికైనా దూరంగా పారిపోయి.. లైఫ్​లో ఉన్న ప్రాబ్లమ్స్​ అన్ని మరచిపోయి అలా ఉండిపోవాలి అనిపిస్తుంది కదా. మీకు కూడా అలా అనిపించే ఉంటుంది కదా.

ఈ బిజీ లైఫ్​లో.. తలనొప్పి కలిగించే సంఘటనలతో.. ఆఫీస్ టెన్షన్​లతో.. అర్థం చేసుకోని మనుషుల చుట్టూ.. అది సరిపోదు అన్నట్లు మానసిక, శారీరక ఇబ్బందులతో లైఫ్​ని లీడ్​ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఓ బ్రేక్ కావాలనుకుంటారు. ఛీ దీనమ్మ ఎక్కడైనా పారిపోతే బాగుండు ఈ జీవితం నుంచి దూరంగా అనుకుంటారు. మీరు కూడా ఏదొక సందర్భంలో అలానే అనుకుని ఉంటారు.

అలా ఎక్కడికైనా వెళ్లిపోయి.. జీవితంలో ఉన్న సమస్యలన్నీ మరచిపోయి.. కాస్త సేద తీరితే ఎంతబాగుంటుంది. అలాంటి ఫీల్ రావడం సహజమే. ఎందుకంటే.. మనకు జరిగే పరిస్థితులే మనల్ని అలా చేస్తాయి. నేటి జీవితంలో ప్రతి ఒక్కరూ హడావిడిగా జీవిస్తున్నారు. కనీసం వారికంటూ ప్రత్యేక సమయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇలా మనిషి నిరంతరంగా టెన్షన్స్ తీసుకుంటున్నప్పుడు.. మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడతాడు. అందుకే ప్రతి ఒక్కరికీ.. శారీరక, మానసికంగా బ్రేక్ అవసరం. ఈ బ్రేక్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది.

ఈ బ్రేక్ మీకు హాయినిస్తుంది కాబట్టి.. మీ మనస్సు మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. ఊపిరాడనంత బిజీ లైఫ్​ని లీడ్​ చేస్తున్నవారికి ఇలాంటి బ్రేక్ చాలా అవసరం కాబట్టి. ఎటైనా వెళ్తే డబ్బులు అయిపోతాయని ఆలోచించకుండా.. ఎక్కడికైనా ఓ ట్రిప్​కు వెళ్లండి. ప్రశాంతంగా అక్కడ గడిపి రండి. కొత్త మనుషులను కలుసుకోండి. అక్కడి సంప్రదాయాలు, సంస్కృతుల గురించి తెలుసుకోండి. ఇవన్నీ కాదు అనుకుంటే.. అక్కడకు వెళ్లి సేదతీరండి.

కొన్నిసార్లు మనకు ఏమి జరుగుతుందో అర్థం కాదు. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయా అనే సందేహం మీలో మొదలవుతుంది. అలాంటప్పుడు వాస్తవికతను అంగీకరించి.. ముందుకు సాగడం నేర్చుకోండి. ఇది మీకు చాలా మంచిది. మీ మీద ఉన్న ప్రెజర్​ను దించేస్తుంది. లేదంటే మీకోసం కొంత సమయం కేటాయించండి. స్వీయ విశ్లేషన చేసుకోండి. మిమ్మల్ని మీరు తప్పా మరేవరూ చూసుకోరని గుర్తించుకోండి. కాబట్టి మీ మీద మీరు ఫోకస్ చేయండి.

ఓ బ్రేక్ తీసుకుని.. మిగిలిన వాటి గురించి మరచిపోండి. మెదుడును విశ్రాంతిగా ఉంచండి. అప్పుడు విషయాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. ఈ సమస్యలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేస్తున్నాయనిపించినప్పుడు కచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. అప్పుడే పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. లేకపోయినా.. మీరే చక్కదిద్దుకునే సామర్థ్యం పొందుతారు.