తక్కువ ధరకే ప్రీమియం రేంజ్ ఫీచర్లతో వచ్చిన బ్లూ స్మార్ట్‌ఫోన్‌!

రూ. 20 వేల బడ్జెట్ ధరలో Blu Bold N2 స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది.ఈ ఫోన్లో అన్నీ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి..అమెరికాకు చెందిన మొబైల్ తయారీదారు BLU నుంచి Blu Bold N2 అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది. సరసమైన ధరలోనే లభించే స్మార్ట్‌ఫోన్‌లో అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. AMOLED డిస్‌ప్లే, భారీ ర్యామ్ కెపాసిటీ, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో పాటు వెనకవైపు నాలుగు కెమెరా సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఉంది.

డిస్‌ప్లేకు రక్షణగా స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లేయర్ ఇచ్చారు. అన్‌లాక్ చేయడానికి ఇన్- డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే AI ఫేస్ ID వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 5Gకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ సుమారు రూ. 20 వేల బడ్జెట్ ధరలోనే లభిస్తుండటం విశేషం.

ఇంకా Blu Bold N2 స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి తదితర విశేషాలను ఈ కింద తెలుసుకోండి.

Blu Bold N2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్6.6 అంగుళాల AMOLED FHD+ డిస్‌ప్లే8GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 810 ప్రాసెసర్వెనకవైపు 64MP + 5MP + 2MP+2MP క్వాడ్ కెమెరా, ముందు భాగంలో 16+2 MP సెల్ఫీ షూటర్‌ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్4200 mAh బ్యాటరీ సామర్థ్యంకనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌లో 5G, 4G LTE, బ్లూటూత్ v5.1, Wi-Fi, USB టైప్-సి పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్లూ బోల్డ్ N2 సైప్రస్ టీల్ అనే ఏకైక కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ అమెరికాలో అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

ధర $249 (దాదాపు రూ. 19,800). భారత్ సహా ఇతర దేశాల మార్కెట్‌లలో ఈ ఫోన్ లభ్యత గురించి కంపెనీ వెల్లడించలేదు.