రాజన్న రచ్చబండ – ప్రజల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన ఎంపీ భరత్

రాజమండ్రి ఎంపీ కార్యాలయం నందు రాజన్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ శ్రీ మార్గాని భరత్, విశిష్ట అతిధులుగా గాండ్ల తెలికుల కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సంకిస భవాని ప్రియ, చేనేత కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి బడిగించల విజయలక్ష్మి, నగర పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర పాల్గొన్నారు.

తొలుత స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తూర్పు గోదావరి జిల్లా నూతన జిల్లా పంచాయతీ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన జగదాంబ గారు, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కృష్ణారావు గారు, డిస్ట్రిక్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీణా దేవి గారు మర్యాదకపూర్వకముగా పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ గారిని కలిశారు.

రాజమండ్రి వీరభద్ర నగర్ కు ఒకే కుటుంబానికి చెందిన కొండేటి లాస్య అమ్ము మరియు కొండేటి చరణ్ ఇద్దరికీ వికలాంగ పెన్షన్ వచ్చేలా సహాయ సహకారాలు అందించిన ఎంపీ భరత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. నాటక కళాకారులకు కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన పెన్షన్ 2015 నుండి రాకపోవడం వలన వారు పడుతున్న కష్టాలను నెరవేర్చి నగరంలో సుమారు 16 మంది నెలకు 4500 వచ్చేలా చేసిన ఎంపీ భరత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధ పడుతున్న 12 సంవత్సరాల దాసు బాబును అతని తల్లి వరలక్ష్మి రచ్చబండకు రాగా తక్షణమే స్పందించి ఈ వ్యాధికి ఏ రాకమయిన సహాయం చేయగలమో అది చేసే విధముగా చేస్తానని తెలిపిన ఎంపీ భరత్. అలాగే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇళ్ల స్థలాలు రాని వారు ఇతరత్రా సమస్యలతో వచ్చిన ప్రజలను స్వయముగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటిని త్వరిత గతిన పరిష్కరించే విధముగా చర్యలు తీసుకున్న ఎంపీ భరత్. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల కార్పొరేషన్ డైరెకర్లు పిల్లి నిర్మల, కానుబోయిన సాగర్, రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, మాజీ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు, వార్డ్ ఇంచార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.