జగన్ మోహన్ రెడ్డి ఇంటిపైనా జాతీయ జెండా

National flag hoisted on CM Jagan's house

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై, ప్రతి సముదాయంపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దాదాపు కోటి జాతీయ పతాకాల్ని పంపిణీ చేసింది.