Latest Posts

ఖద్యతే చాసాం నామరూపే,పురుష ఇత్యేవం ప్రోచ్యతే,స ఏషోఽకలో అమృతో భవతి-ప్రశ్నోపనిషత్ 6-5

పురుషుడి నుండే పుట్టి ఉన్న పదహారు కళలు పురుషునిలోనే అణగిపోతాయి. దీనికి ప్రశ్నోపనిషత్తు ఒక ఉదాహరణను ఇచ్చుచున్నది. గంగా యమునా గోదావరి మొదలైన అన్ని నదులూ ప్రవహించి ప్రవహించి చివరికి సముద్రమును చేరుకొని సముద్రములో ఒక్కటైపోయి సముద్రమనే పిలువబడతాయికదా? ఈ విధముగనే ప్రాణాది సకల కళలూ పురుషునినుండి పుట్టి తుదకు పురుషునిలోనే కరిగిపోతాయి.

అవిద్యావస్థలో అన్ని కళలూ ఆత్మనుండే వచ్చి వున్నాయి అని ఉపనిషత్తులలో చెప్పివున్నారు. అయితే పరమార్థముగా చూచినపుడు అన్నియూ ఆత్మే అయిపోతాయి. ఉపనిషత్తులలో తెలిపినట్లుగా ఆత్మను సరిగ్గా అర్థముచేసుకొనినచో అప్పుడు అన్ని కళలూ ఆత్మయందే లయమైపోతాయి. అప్పుడు నామరూపములు ఆత్మలోనే కరిగిపోతాయి. ఆత్మ కంటే భిన్నముగా కళలు వుండనే వుండవు. ఆత్మజ్ఞానముతో మాత్రమే కళలన్నియూ ఆత్మలయందే లయమవుతాయి
।ఓం శాంతిః శాంతిః శాంతిః।

Latest Posts

Don't Miss