లైగర్ సినిమా రమ్య కృష్ణకి కలిసొస్తుందా ? Can Liger give RamyaKrishna better chances?

లైగర్ సినిమా రమ్య కృష్ణకి కలిసొస్తుందా ?

పూరీ జగన్నాద్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ చిత్రం ట్రైలర్ తో ఇటు పూరీ అభిమానులకు అటు విజయ్ దేవరకొండ అభిమానులలో పండగ వాతావరణం నెలకొంది. ఈ చిత్రం కోసం హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా వర్కౌట్ చేశాడు. అభిమానుల్లో జోష్ తీసుకొచ్చాడు. పైగా పూరీ జగన్నాద్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరు.

బాహుబలి తర్వాత రమ్య కృష్ణ చాలా సినిమాల్లో ఇంపార్టంట్ పాత్రలు చేసింది. ఆమె పోషించిన కేరెక్టెర్స్ఆధారంగా చిత్రం టైటల్స్ కూడా పెట్టారు. కానీ శివగామి తర్వాత ఆ రేంజీలో గుర్తింపు దక్కలేదు. తాజాగా లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ అమ్మ పాత్రలో నటిస్తున్న పాత్ర అయిన ఆమెకు క్రేజ్ తీసుకొస్తుందా ?

హీరోయిన్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించిన రమ్య కృష్ణ, సీనియర్ స్టార్స్ అందరితో వరసగా సినిమాలు చేసింది. ఆమెకు హిరోయిన్ గా ఎన్ని హిట్స్ ఉన్నా, బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు ఎప్పుడు రాని గుర్తింపు లభించింది. ఈ చిత్రంతో ఇండియన్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగిన రమ్య కృష్ణకి ఆ స్థాయిలో క్రేజ్ తీసుకొచ్చిన మూవీ ఒక్కటి కూడా రాలేదు.

అయితే ఆమె ఇప్పటి వరకు సైన్ చేసిన సినిమాలు మరో సారి గుర్పింపును తీసుకొస్తాయనే నమ్మకంతో ఉంది ఈ సీనియర్ హేరోయిన్. బాహుబలి తర్వాత ఆమె శైలజ రెడ్డి అల్లుడు, రొమాంటిక్, బంగార్రాజు వంటి తదితర సినిమాల్లో ఇంపార్టంట్ రోల్ ప్లే చేసింది. కానీ ఆమెకు ప్రత్యకమైన ఇమేజ్ యాడ్ కాలేదనే చెప్పాలి. వాస్తవానికి సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో రమ్య కృష్ణ రోల్ సినిమా హైలైట్స్లో ఒకటిగా నిలిచింది. డైరెక్టర్ పూరీ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రంలో కూడా రమ్య కృష్ణ ఇంపార్టంట్ రోల్ పోషించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బొక్క బోర్లా పడడంతో, ఆమె చేసిన పోలీసు పాత్రకు సైరైన గుర్తింపు రాలేదు.

లైగర్ మూవీలో ఇంపార్టంట్ రోల్

రొమాంటిక్ చిత్రంలో రమ్య కృష్ణ ఆక్టింగ్ కు ఫిదా అయిపోయిన పూరీ,ఈ మూవీలో ఇంపార్టంట్ రోల్ ఇచ్చారు. రమ్య కృష్ణ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. కృష్ణ వంశీ డైరక్షన్ లో రంగమార్తాండ చిత్రంలో ప్రకాష్ రాజ్ భార్యగా ఇంపార్టంట్ రోల్ పోషించింది. లైగర్ ప్రమోషన్ నెల రోజులుగా సాగుతుండగా, తాజాగా రమ్య కృష్ణ కూడా జాయిన్ అయింది. ఈ చిత్రంలో మాస్ మదర్ గా కనిపించిన రమ్య కృష్ణ కు ఈ చిత్రం ఏమేరకు పేరు తెస్తుందో చూడాలి మరి.                

ఇవి చదవండి : మునుగోడులో పార్టీ పరిస్థితిలపై కెసిఆర్ సర్వే.. వాస్తవం ఏమిటంటే ..?