అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా బిజెపి జాతీయ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల ద్వారా అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా బిజెపి జాతీయ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పావులు కదుపుతుంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బిజెపి తన పట్టు పెంచుకునేందుకు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలను బిజెపిలో చేర్చుకుని సఫలీక్నతమైంది. దక్షిణ తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆపార్టీ నేతలు, జాతీయ అధిష్టానం తీవ్రంగానే శ్రమిస్తుంది. ఉత్తర తెలంగాలోనూ పాగా వేయడానికి పావులు కదుపుతోంది. రంగారెడ్డి జిల్లాలో బలమైన నేత, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. అలాగే కీలకమైన జిల్లాలైన నల్గొండ, ఖమ్మం జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు చేరుతారంటూ బండి సంజయ్ చేబుతూ వస్తున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాషాయా కండువా కప్పేశారు. ఆ క్రమంలో ఖమ్మం జిల్లా నుండి ఓ ఎంఎల్ఏ చేరుతారంటూ ప్రచారం జోరందుకుంది. త్వరలోనే మరో ఇద్దరూ కీలక నేతలు చేరతారంట.

బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కొత్త తరహా రాజకీయాన్ని అమలు చేస్తూ వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను, ఆయా పార్టీలోని అసమ్మతి వాదులను పార్టీలో చేర్చుకుంటారు అనే చర్చ సాగుతున్న సమయంలో అధికార టిఆర్ఎస్ పార్టీలో ఆలజడి స్టార్ట్ అయింది. అదే తరహాలో కాంగ్రెస్ పార్టీలో సైతం ఆందోళన మొదలైంది. దీంతో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పార్టీలో అసంత్నప్తిగా ఉన్న ఎంఎల్ఏలను, మాజీ ప్రజా ప్రతినిధులను, జిల్లా నేతలు బుజ్జగించేందుకు సిద్దమైయిందంట. ఎవరూ చెబితే వింటారో ఆ నేతలను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆనేతల ఇళ్ళకు కీలకమైన నేతలు రాకపోకలు జోరుగా సాగుతుండటంతో ద్వితీయ శ్రేణి నేతలు తాము ఏ వర్గంలోకి ఏపార్టీలోకి వెళ్లాలో ఆర్దం కావటం లేదంటూ తలలు పట్టుకుంటున్నారు.

రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని కేంద్రంలో, రాష్రంలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతూ వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే భద్రాద్రి కోత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధికార పార్టీలో ఇమడ లేక రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యేలకు కూడా ఆయా నియోజకవర్గంలో అధికారపార్టీలో గుర్తింపు లేదంటూ అవేధన చెందుతున్న నేతలు చూపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. రానున్న ఎన్నికలలో టిక్కెటే లక్ష్యంగా పార్టీలు అధినేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. సీటు ఇస్తామంటే తాము పార్టీలో చేరటం ఖాయమే అంటున్నారు మాజీలు. ఇక జిల్లాలో రాజకీయం ఏలా ఉండబోతుందోనంటు రాజకీయ విశ్లేషుకులకు సైతం అంతుబట్టని పరిస్థితిగా తయారైంది జిల్లాలో రాజకీయం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీనియర్ నేతలు బిజెపికి టచ్ లో ఉన్నారంటూ ఆపార్టీ అధక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయాల్లో తాజా పరిణామాలకు బలం చేకూరుస్తున్నాయి. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలతో పలుమార్లు కలవటంతో పాటు ఫోన్లలో బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. బిజెపిలోకి చేరేందుకు కొందరు ముఖ్య నేతలు ఆ నాయకత్వంతోనే రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు సమాచారం. ఒకవైపు బిజెపితో మరో వైపు కాంగ్రెస్ టిపిసిసి ఛీప్ రేవంత్ రెడ్డితో జిల్లాలోని కొందరు ఎంఎల్ఏలు, మాజీలు, ముఖ్య నేతలు టచ్ లో ఉంటూ త్వరలోనే పార్టీలోకి చేరేందుకు మూహార్తాలు సైతం ఫిక్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాల్లోలు హాట్ హాట్ గా నడుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి తుమ్మల పిడుగులు ఎప్పుడైనా పడొచ్చు అందరూ సిద్దంగా ఉండండి అంటూ రాజకీయ వర్గాల్లో కాక రేపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్లో ఒకరు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టిఆర్ఎస్ చేరారు. ఆయనకు ఆ టికెట్ కూడా నల్గొండకు చెందింన కోమటిరెడ్డి సోదరులు దగ్గరుండి ఎన్నికల సమయంలో బీ ఫామ్ ఇప్పించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఖమ్మం పర్యటనకు వచ్చిన కేటీఆర్ జిల్లాలోని నేతలతో సమావేశం అయిన సందర్భంలో సిట్టింగ్ లకు టికెట్ వస్తదని అనుకోవద్దు అన్న మాటలకు ఆ నేత కొంత కాలంగా కేటీఆర్ వ్యాఖ్యలతో అంతర్మథనంలో పడ్డారట. అప్పటి నుండే ఆయన పార్టీ మార్పుపై ప్రణాళికలు చేసుకుంటున్నారట. ఆయనకు కోమటిరెడ్డి బ్రదర్స్ తో వ్యాపార సంభందాలతో పాటు కొన్ని అంశాలకు సంబంధించి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ ఎమ్మెల్యే పార్టీ మార్పుపై ఎప్పుడు నోరు విప్పుతారో చూడాలి.

ఇక ఉమ్మడి జిల్లాలో మంచి పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఎప్పటినుంచో పార్టీ మార్పు తధ్యం అంటూ ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆయన కూతురు ఎంగేజ్మెంట్ కు అధికార పార్టీ కీలక నేతలు చాలా తక్కువ మంది వెళ్ళారని టాక్. ఆ కార్యక్రమంకు బీజేపీ పార్టీ చీఫ్ బండి సంజయ్ తో పాటు,ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావుతో పాటు కీలక నేతలు పాల్గొన్నారని విస్తృతంగా ప్రచారం సాగుతుంది. పొంగులేటికి గత కొంతకాలంగా టిఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి పదవి కట్టబెట్టకపోవడం, ఆయన అనుచరులపై కొంతమంది ఎమ్మెల్యేలు కేసులు పెట్టి వేదించటం వంటి అన్ని అంశాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పొంగులేటి తన కూతురు పెళ్ళి తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్రకు ప్లాన్ చేసినట్లు తేలుస్తుంది.పొంగులేటి కూడా అతి త్వరలోనే పార్టీ మార్పు ఖాయం అని రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చ నడుస్తుంది. ఇదే జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే, మరో సీనియర్ నేత కూడా పార్టీ మరెందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. వీరంతా గుండు గుత్తాగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఆపార్టీ చీఫ్ బండి సంజయ్ చెప్పిన ఏమేరకు నిజమవుతాయో చూడాలి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలో జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ అసంతృప్త నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఎప్పుడు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటారోనని జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నట్లు ఖమ్మం జిల్లా నుండి అపార్టీలోకి నేతలు చేరితే ఆపార్టీకి జిల్లాలో బలపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.