బాలినేని అసంతృప్తికి కారణమేంటి ?

ఆ అధికారపార్టీ ఎమ్మెల్యే మంత్రి పదవి ఊడిపోయాక.. కొంత కాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సీఎం జగన్ కు సమీప బంధువైన ఆయన వైసీపీలో మొదటి నుంచి కీ రోల్ పోషిస్తూ వచ్చారు. ఇటీవల ఆయన వ్యవహార తీరు బహిరంగంగా ఆయన చేస్తున్న కామెంట్స్ అధికారపార్టీని కలవర పెడుతున్నాయంట. ఆయనలో అంత అసంతృప్తికి కారణమేంటి ? అసలు ఆ అదికారపార్టీ ఎమ్మెల్యే ఎవరో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం.

మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణలో మంత్రి పదవి కోల్పోయాక తీవ్ర అసంతృప్తి గా ఉన్నారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇటీవల సొంత పార్టీపైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వైసీపీలో కాక రాజేస్తున్నారు. తాజాగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనపేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. చేనేత వస్త్రాలు ధరించి ఆ ఫోటోలు పోస్ట్ చేయాలని సూచించారు. కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్ కల్యాణ్.. మరో ముగ్గురిని అందులోనామినేట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో పాటు బాలినేని వాసును నామినేట్ చేశారు పవన్.

వెంటనే ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే పవన్ ఛాలెంజ్ స్వికరించిన బాలినేని చేనత వస్త్రాలు ధరించి జనసేన అదినేత పవన్ కి రీట్విట్ చేశారు. ఆ క్రమంలో పవన్ తన చేనేత ఛాలెంజ్‌లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని నామినేట్ చేయడం ప్రకాశం జిల్లా రాజకీయాలో చర్చగా మారింది. పవన్ నామినేట్ చేసిన వారిలో ఒకరు చంద్రబాబు.. మరొకరు బీజేపి నేత లక్ష్మణ్ ఉన్నారు. చేనేత ఛాలెంజ్‌కి పవన్ ఏపీ చేనేత మంత్రికి నామినేట్ చేసినా ఓ లెక్క ఉంటుంది. కాని ప్రస్తుతం మంత్రిగా లేని బాలినేనికు పవన్ ఎందుకు చేనేత ఛాలెంజ్ చేశారన్నది వైసిపి లో చర్చగా మారింది.

బాలినేని కూడా పవన్ కల్యాణ్ తనకు కామన్ ఫ్రేండ్ అని వ్యక్తిగతంగా కలుస్తుంటామని చెప్పుకొచ్చారు. ఇటీవల ఒంగోలులో జనసేన పార్టీ కార్యకర్తపై పెట్టిన కేసును కూడ పవన్ కళ్యాణ్ విజ్ణప్తితో విరమించుకుంటునట్లు బాలినేని మీడియ ముఖంగా తెలిపారు. సో మెత్తానికి పవన్ కల్యాణ్, బాలినేని మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే కొంత కాలంగా బాలినేని చెస్తున్న కామెంట్స్ సొంతపార్టీని ఇరుకున పెడతున్నాయంట.

వైసిపిలోని కొంత మంది నేతలే తనను కావలని రాజకీయంగా టార్గట్ చెశారని.. వాళ్ళు అంతు చూస్తానని సిఎం జగన్ దగ్గర తాడో పెడో తేల్చుకుంటునని బాలినేని వ్యాఖ్యానించడం.. ప్రకాశం జిల్లా వైసీపీలో తీవ్ర కలవరం రేపుతోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణలో మంత్రి పదవి కోల్పవడం బాలినేని జీర్ణించకోలేక పోతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజకీయంగా సీనియర్ అయిన తాను సీఎం జగన్‌కు దగ్గర భంధువునని అయినా తనకు ప్రాధన్యత తగ్గుతుందని మధన పడుతున్నారంట బాలినేని ఆ క్రమంలో ఆయన పార్టీ మారి జనసేన కండువా కప్పుకుంటారన్న ప్రచారం మొదలైంది.

అయితే తాను జనసేనతో టచ్‌లో ఉన్నాననే ప్రచారం అవాస్తవమని బాలినేని అంటున్నారు. ఊసరవెల్లి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని రాజకీయాల్లో ఉంటే వైసీపీ లోనే ఉంటా.. లేకుంటే రాజకీయాలు మానేస్తా అని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ లో తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేస్తే తాను చేనేత వస్త్రాల ధరించి స్పందించినట్లు వివరించారు వైసీపీ కార్యకర్తల కోసం తను ఎంతవరకైనా పోరాడతా అంటున్నారు.

ఏదేమైనా వైసీపీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న బాలినేని వచ్చే ఎన్నికలనాటికి మిత్రుడైన, పవన్ కల్యాణ్ పార్టీలో చెరుతారని టాక్ వినిపిస్తోంది. ఒంగోలులో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో కాపుల ఓట్ బ్యాంక్ కోసం బాలినేని పవన్ కళ్యాణ్ కార్డు వాడుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.