తదైక్షత బహు స్యాం ప్రజాయేయ ఇతి

తదైక్షత బహు స్యాం ప్రజాయేయ ఇతి।
ఛాందోగ్యోపనిషత్ 6-2-3
అది “నేను బహుళముకావలెను, నేను బహుళముగా పుట్టవలెను” అని ఆలోచించను
‘అది’ అంటే సత్ స్వరూపమైన బ్రహ్మము. ‘అది ఆలోచన చేసెను, అనుటవలన యోచన చేసినది చిన్మాత్రస్వరూపమైన బ్రహ్మమే గానీ జడమైన ప్రధానము కాదు. అచేతనమైన ప్రధానమునకు యోచన చేసెడు సామర్థ్యము ఉండదు కదా?