సైషా చతుష్పదా షడ్విధా గాయత్రీ – ఛాందోగ్యోపనిషత్ 3-12-5

ఆ ఈ గాయత్రియనునది నాల్గు పాదములు కలిగినదీ, ఆరు విధములుగానూ ఉండును.

ఇక్కడ ‘గాయత్రీ’ అంటే ఛందస్సు యొక్క పేరు. క్రమముగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు అక్షరములలో ఒక్కొక్క పాదమును కలిగిన ఛందస్సుకు క్రమముగా ఉక్తా, అత్యుక్తా, మధ్యా, ప్రతిష్ఠా, సుప్రతిష్ఠా, గాయత్రీ అని పేరు. ప్రస్తుతమిందు ఆరు అక్షరములతో కూడిన ఒక్కొక్క పాదమువలె నాల్గు పాదములను కలిగిన ఛందస్సుకు గాయత్రీ అనిపేరు. ఇది ‘చతుష్పదా గాయత్రీ’ అనబడివున్నది.