రామ్మోహన రావు గారి 69వ జయంతి సందర్భంగా…

దివంగత నేత మాజీ మంత్రివర్యులు శ్రీ జక్కంపూడి రామ్మోహన రావు గారి 69వ జయంతి సందర్భంగా 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసన సభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారి కార్యక్రమాల వివరాలు.

ఉదయం 09:00 గంటలకు రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం నందు కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.ఆ తర్వాత 10:30 గంటలకు రాజమహేంద్రవరం కంబాలచెరువు వద్ద నగర వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీ జక్కంపూడి రామ్మోహన రావు గారికి విగ్రహానికి పూల మాలలు వేసి,నివాళులు అర్పించి అనంతరం కేక్ కటింగ్ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారు పాల్గొంటారు.ఉదయం 11:30 గంటలకు కడియం మండలం బుర్రిలంక గ్రామం *ప్రాథమిక పాఠశాల నందు కొత్తపల్లి మూర్తి గారి దివంగత నేత శ్రీ జక్కంపూడి రామ్మోహన గారి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 12:15 గంటలకు
రాజమహేంద్రవరం లాలాచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం వద్ద యాంకర్ చోటు ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 01:00 గంటలకు రాజానగరం జి.ఎస్.ఎల్ డెంటల్ కాలేజీ నందు క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా రాజానగరం తీర్చిదిద్దాలనే లక్ష్యంతో శ్రీ జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ మరియు జి.ఎస్.ఎల్ హాస్పటల్ వారి సంయుక్త సౌజన్యంతో ఉచితంగా మహిళలకు మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు పాల్గొంటారు.మధ్యాహ్నం 02:00 గంటలకు రాజానగరం జి.ఎస్.ఎల్ ఇండోర్ ఆడిటోరియం నందు నియోజకవర్గ సంబంధించి నూతన పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు పాల్గొంటారు.సాయంత్రం 06:00 గంటలకు రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నందు పడిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.