కడియపు లంకలో రూ.11.60 లక్షల అమ్మవారు…

శ్రావణ మాసం పురస్కరించుకొని కడియపు లంక శ్రీ ముసలమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మ వారిని ఏకంగా రూ.11.60 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. 25 మంది ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోచేప్పట్టిన ఈ కార్యక్రమంలో పది రూపాయల నోట్ల నుండి రెండు వేలరూపాయల కొత్త నోట్లతో అలంకరించారు. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు స్వామి శంకర విశ్వనాధ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయి అమ్మ వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ పెద్దిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ.. 60 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని ప్రజా విరాళాలతో నూతన ఆలయంగా పునఃనిర్మిస్తున్నట్లు వెల్లడించారు.