ఒకే వేదికపైకి ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళుతున్నారు. ప్రధాని మోదీతో కలిసి సమావేశంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక మందిరంలో ఆజాదీ కా అమృతోత్సవ్‌ కార్యక్రమంలో భాగస్వాములవుతారు.

శనివారం ఉదయం అయన హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అమృతోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొని.. ఆ తర్వాత అమృతోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొని.. రాత్రికి చంద్రబాబు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్‌ సమావేశానికి చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. లిఖితపూర్వక ఆహ్వానం పంపడంతో పాటు ఫోన్‌ కూడా చేసి చంద్రబాబును ఆహ్వానించారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతోపాటు ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. మొత్తం 240 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం.