ముమ్మరంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టండి

www.breakinguru.com

ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ఆదేశాలు

గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికార యంత్రాంగం అంకిత భావంతో పని చేయాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా ప్రజలను చైతన్య పరచాలన్నారు. చెత్తా చెదారం ఎక్కడా లేకుండా…మురుగునీటి పారుదలకు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి వాకబు చేయాలన్నారు. జ్వర పీడితులను, ఇతరత్రా అనారోగ్య బాధితులను గుర్తించి వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని సేవించాలని, తాజాగా వేడిగా ఉన్న ఆహర పదార్ధాలనే భుజించాలని ప్రజలకు సూచించారు.