దేశంలో రెండో మంకీపాక్స్‌ కేసు నమోదు

తిరువనంతపురం: దేశంలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదైంది. ఇప్పటికే కేరళలో తొలి కేసు నమోదు కాగా.. తాజాగా కన్నూరు జిల్లాలో రెండో కేసు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేరళ వైద్యాశాఖ కూడా ధ్రువీకరించింది. కాగా.. యూఏఈ నుంచి కేరళకు తిరిగొచ్చిన ఓ వ్యక్తికి ఇటీవల మంకీపాక్స్‌ సోకిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తి యూఏఈలో వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు వెల్లడించారు.