ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పశ్చిమ ఆస్ట్రేలియా ఎంవోయూలు

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు బుగ్గన, గుడివాడ అమర్ నాథ్, పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ మంత్రి రాగర్ కుక్, పశ్చిమ ఆస్ట్రేలియా మంత్రి డేవిడ్ టెంపుల్టన్ తదితరులు.

నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పశ్చిమ ఆస్ట్రేలియా ఎంవోయూలు చేసుకోనుంది. పరిశ్రమలు, నైపుణ్యం, విద్య, శిక్షణ, గనులు, ఖనిజాలు, తయారీ రంగాల్లో పరస్పర సహకారంతో పెట్టుబడులను ఆకర్షించడంలో తోడ్పాటు దిశగా ఒప్పందం కుదుర్చోకున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా. శనివారం విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా జరుగుతోన్న ఒప్పందాల కార్యక్రమంలో మంత్రులు బొత్స, బుగ్గన, గుడివాడ అమర్ నాథ్, పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ మంత్రి రాగర్ కుక్, పశ్చిమ ఆస్ట్రేలియా మంత్రి డేవిడ్ టెంపుల్టన్ తదితరులు పాల్గొన్నారు.