Wednesday, September 24, 2025

దొరికితే స్మగ్లర్ దొరక్కుంటే భాస్కర్

“లక్కీ భాస్కర్” కాదు… ఇది రియల్ లైఫ్ స్కామ్ !
తెలుగు ప్రేక్షకులందరికీ “లక్కీ భాస్కర్” సినిమా గుర్తుండే ఉంటుంది. ఓ సాధారణ వ్యక్తి విదేశీ కార్లను డబుల్ రేటుకు విక్రయిస్తూ డబ్బుల బండారం ఎలా కట్టాడో చూపించిన కథ. అయితే ఇప్పుడు అలాంటి స్కెచ్ రీల్ కాదు, రీల్ లైఫ్ నుంచే రియల్ లైఫ్‌లోకి జారిందట! అదీ భూటాన్ కార్ల స్మగ్లింగ్ రూపంలో.

భారీ లగ్జరీ కార్ల స్కామ్… ఇంటెలిజెన్స్‌కు చిక్కిన ముఠా

ఇటీవల ఇండియా ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ భారీ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ రాకెట్‌ను బట్టబయలు చేశాయి. వెంటనే ‘ఆపరేషన్ నమకూర్’ పేరుతో కస్టమ్స్ శాఖ దేశవ్యాప్తంగా సోదాలు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా మలయాళ సినీ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో సోదాలు జరగడంతో ఈ స్కామ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

స్మగ్లింగ్ రూట్ ఎలా?

విదేశాల నుంచి ఖరీదైన కార్లు దిగుమతి చేసుకుంటే భారీగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ… అదే సమయంలో కొంతమంది ఏజెంట్లు, తప్పుడు పత్రాలతో, భూటాన్ రిజిస్ట్రేషన్ నంబర్లతో కార్లను అక్రమంగా భారత్‌లోకి తీసుకువచ్చే స్కెమ్‌ను అమలు చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌ సిమ్లా రూరల్ (HP-52) ప్రాంతం నుంచి ఈ వాహనాలను రిజిస్టర్ చేయించి దేశంలో నడిపేలా చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ, కొంతమంది అధికారులు, స్థానిక ముఠాలు కలిసి ఈ దందాను పక్కాగా నడిపినట్టు తెలుస్తోంది.

రూ.1 పెట్టి రూ.10 కొట్టే లాభం!

భూటాన్ ఆర్మీ ఇటీవల 150 విలాసవంతమైన వాహనాలను తమ వాహన శ్రేణి నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం, వీటిని స్థానికంగా విక్రయించడానికి అనుమతి ఉంది. కానీ… కొంతమంది భారతీయులు వీటిని తక్కువ  ధరలకు కొనుగోలు చేసి, కస్టమ్స్ డ్యూటీ లేకుండా అక్రమంగా ఇండియాలోకి తెచ్చారు.

ఉదాహరణకు, ఒక వాహనాన్ని భూటాన్‌లో రూ. లక్షకు కొని, భారత్‌లో రూ. 10 లక్షలకు పైగా విక్రయించారు. కొన్ని ఎస్‌యూవీలకు అయితే, రూ. 3 లక్షలు పెట్టి రూ. 30 లక్షలకు అమ్మిన కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఇలా బయటపడిన స్కాం

కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈ స్కామ్‌లో రూ. 25 లక్షలు పెట్టి ఓ వాహనం కొని నడుపుతుండగా, కస్టమ్స్ తనిఖీల్లో ఇది బయటపడింది. అప్పటి నుంచే అధికారులు తీగ లాగుతుంటే.. దొంగల దండు మొత్తం బయటపడింది.

ఇప్పటివరకు కనీసం 20 కార్లు కేరళలో అక్రమంగా విక్రయించబడ్డాయని అధికారులు భావిస్తున్నారు. దాంతో, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఇళ్లపై కస్టమ్స్ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇంకా పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు

ఈ స్కామ్‌లో ప్రధానంగా భూటాన్-ఇండియా ట్రేడ్ గ్యాప్, కస్టమ్స్ పద్ధతుల్లోని లొసుగులు, ఇంకా స్థానిక అధికారుల సహకారం కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేయగా, ఇంకా పలువురు ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉందని సమాచారం.

కథలో కనిపించిన ప్లాన్ నిజ జీవితంలో నిజమవుతుందనుకుంటే… దాని ఫలితాలు కూడా అంతే తీవ్రమవుతాయి! ఈసారి లక్కీ కాదు… లాస్ట్ అయ్యే చాన్స్ ఎక్కువే!

Hot this week

బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహం.. అనంతరం విషాదం!

హైదరాబాద్‌లోని ఆదిబట్లలో బతుకమ్మ సంబరాలు ముగిసిన కొద్దిసేపటికే, ఓ మహిళ గుండెపోటుతో...

సభలకు వచ్చే జనాలంతా ఓటర్లు కాదు: కమల్ హాసన్

కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సభలకు వచ్చే జనాలంతా ఓటేస్తారనేది భ్రమ"...

నంబర్ 1 గా ఎదగాలి : కలెక్టర్ల సదస్సులో  చంద్రబాబు 

2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్‌వన్‌ దేశంగా తీర్చిదిద్దాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం – చంద్రబాబు ఆదేశాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో రోజురోజుకు యాత్రికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో అత్యాధునిక...

Topics

బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహం.. అనంతరం విషాదం!

హైదరాబాద్‌లోని ఆదిబట్లలో బతుకమ్మ సంబరాలు ముగిసిన కొద్దిసేపటికే, ఓ మహిళ గుండెపోటుతో...

సభలకు వచ్చే జనాలంతా ఓటర్లు కాదు: కమల్ హాసన్

కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సభలకు వచ్చే జనాలంతా ఓటేస్తారనేది భ్రమ"...

నంబర్ 1 గా ఎదగాలి : కలెక్టర్ల సదస్సులో  చంద్రబాబు 

2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్‌వన్‌ దేశంగా తీర్చిదిద్దాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం – చంద్రబాబు ఆదేశాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో రోజురోజుకు యాత్రికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో అత్యాధునిక...

చీట్ చేసిన కాంగ్రెస్…? చెప్పుతో కొట్టాలి !

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కాంగ్రెస్ నేతలపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారని...

గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ – పూర్తి వివరాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-2 పోస్టులకు...

గణేశ్ నిమజ్జనం పైకి దూసుకొచ్చిన ట్రక్… 9 మంది మృతి

హాసన్ (కర్ణాటక), సెప్టెంబర్ 12 – గణేశ్ చతుర్థి ఉత్సవాలు ఆనందంగా సాగుతున్న...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img