మార్చి చివ‌రివారంలో 27నుంచి 31 తేదీల‌లో సెంట‌ర్ ఫ‌ర్ సెఫాల‌జీ స్ట‌డీస్ (సిపిఎస్‌) చేసిన స‌ర్వే ప్ర‌కారం వైఎస్సార్ సీపీ.. 121నుంచి 130 సీట్లు గెలుచుకుంటుంది. ఈ స‌ర్వే శాంపిల్ సైజు 3, 04, 323. ఈ స‌ర్వే ప్ర‌కారం తెలుగుదేశం గెలుచుకునే సీట్లు 45-54. జ‌న‌సేన‌కు 1నుంచి 2 సీట్లు మాత్ర‌మే ద‌క్క‌నున్నాయి. ఇదే సంస్థ ఫిబ్ర‌వ‌రిలో స‌ర్వే చేసిన‌ప్పుడు వైఎస్సార్ సీపీకి టిడిపి మ‌ధ్య‌న ఓట్ల తేడా 4.5 శాతం. మార్చి ఆఖ‌రికి వ‌చ్చేస‌రికి ఈ తేడా 8 శాతానికి చేరుకుంది. అంటే 48.1 శాతం ఓట్లు వైఎస్సార్ సీపీకి ప‌డితే 40.1 శాతం ఓట్లు టిడిపి ప‌డ‌నున్నాయ‌ని సిపిఎస్ స‌ర్వే చెబుతోంది. ఈ స‌ర్వే ప్ర‌కారం వైఎస్ఆర్ సీపీ గెలుచుకునే లోక్ స‌భ సీట్లు 21, టిడిపికి వ‌చ్చేవి 4.
ప్ర‌జ‌ల్లో వున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌నేది చ‌ర్చ‌లోకి రాకుండా చేయ‌డానికి చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని సిపిఎస్ సంస్థ చెబుతోంది. నరేంద్ర‌మోదీ, జ‌గ‌న్ వ‌ల్ల‌నే రాష్ట్రానికి స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌చారం అబ‌ద్ధ‌మే త‌ప్ప అందులో నిజం లేద‌నే విష‌యం ప్ర‌జ‌లు తెలుసుకున్నార‌ని స‌ర్వే తేల్చింది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు దాగుడు మూత‌ల్ని ప్ర‌జ‌లు ఛీకొడుతున్నట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మొద‌టినుంచీ ప్ర‌త్యేక హోదాను స‌జీవంగా వుంచి దానికోసం పోరాడుతున్న‌ది జ‌గ‌నే అనే విష‌యాన్ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తెలుసుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీ రికార్డుల సాక్షిగా ముఖ్య‌మంత్రి చంద్రాబాబు ప్యాకేజీకి మ‌ద్ద‌తు ప‌లికారు. న‌రేంద్ర‌మోదీ చాలా గొప్ప నేత అని ఆయ‌న అసెంబ్లీలో ప్ర‌శంసించిన విష‌యాన్ని ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు. ఇప్పుడ‌దే చంద్ర‌బాబు ప్యాకేజీ బాగా లేద‌ని, హోదా కావాల‌ని యూట‌ర్న్ తీసుకోవ‌డాన్ని చూసి సామాన్య ప్ర‌జ‌లు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు.
వైఎస్ జ‌గ‌న్‌కు కేసీఆర్‌కు ముడిపెట్టి చంద్ర‌బాబు మాట్లాడ‌డాన్నికూడా ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేదు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చంద్ర‌బాబుకు ఓటేసిన‌ట్టేన‌ని తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్ అన్నారు. అప్పుడు తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మారు. ఎందుకంటే చంద్ర‌బాబు తెలంగాణ‌లో పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తున్నారు కాబ‌ట్టి. చంద్ర‌బాబు తెలంగాణ‌లో చేసిన ప‌నిని కేసీఆర్ ఆంధ్రాలో చేయ‌డం లేదు. ఏపీ ప్ర‌జ‌ల ముందు కేసీఆర్‌ను నెగెటివ్ చూప‌డానికి చంద్ర‌బాబు, పవ‌న్ క‌ల్యాణ్ ప‌డుతున్న పాట్లు న‌వ్వుల‌పాల‌వుతున్నాయి.
వైఎస్ జ‌గ‌న్ చెబుతున్న న‌వ‌ర‌త్న ప‌థ‌కాలు గ్రౌండ్ లెవెల్లో క్లిక్ అవుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం వైఎస్ జ‌గ‌న్ ప‌డిన క‌ష్టం. ఆయ‌న త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో నిర్వ‌హించిన 123 పాద‌యాత్ర బ‌హిరంగ‌స‌భ‌లు, 55 ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో న‌వ‌ర‌త్న ప‌థ‌కాల గురించి గ‌ట్టిగా వివ‌రించారు. అన్నిటి గురించీ ఒకేసారి చెబితే బోర్ కొడుతుంద‌ని..ఒక దాని గురించి ఒక్కో స‌భ‌లో చెప్పుకుంటూ వ‌చ్చారు. ప్ర‌తి న‌వ‌ర‌త్న ప‌థ‌కం వెన‌క వున్న ఆలోచ‌న‌ల్ని కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అన్న‌దాత‌ల‌కు ప్ర‌తి ఏడాది ఉచితంగా అందించే రూ.12, 500 పెట్టుబ‌డి సాయం గురించి రెండేళ్ల క్రిత‌మే త‌న పార్టీ ప్లీన‌రీలో వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. దీన్ని తెలంగాణ‌లో కేసీఆర్ అమ‌లుచేశారు.
స్వ‌యం స‌హాయ‌క బృందాల ప‌సుపు కుంకుమ‌, పింఛ‌న్లు, అన్న‌దాత సుఖీభ‌వ పెట్టుబ‌డి డ‌బ్బులు…ఈ మూడూ ఎన్నిక‌ల ముందు మాత్ర‌మే ఇస్తున్న‌వి. ఈ విష‌యంపై ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌లుగుతోంది. దాంతో డ్వాక్రా మ‌హిళ్ల‌లో 45.2 శాతం వైఎస్సార్ సీపీవైపు వుంటే 44 శాతం టిడిపి వైపు వున్న‌ట్టు స‌ర్వే ద్వారా తెలుస్తోంది. చంద్ర‌బాబు చెబుతున్న మాట‌ల్ని నిజ‌మ‌ని న‌మ్మితే డ్వాక్రా మ‌హిళ‌లంద‌రూ దాదాపుగా టిడిపివైపు వుండాలి. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో డ్వాక్రా రుణాలను బేష‌ర‌తుగా మాఫీ చేస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ ఆ ప‌ని చేయ‌లేదు. ఈ కోపాన్ని త‌గ్గించ‌డానికి ప‌సుపు కుంకుమ డ్రామా మొద‌లుపెట్టారు. కానీ అది విక‌టిస్తోందనేది సిపిఎస్ స‌ర్వే ద్వారా తేలుతోంది. అంతే కాదు ప్ర‌జ‌ల్లో వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వమంటే ఇష్ట‌ప‌డేవారు 46 శాత‌ముంటే 39 శాతం చంద్ర‌బాబునాయుడును ఇష్ట‌ప‌డుతున్నారు. ఇక అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన అంశం… చంద్ర‌బాబునాయుడు ద‌గ్గ‌ర‌నుంచి టిడిపి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు అంద‌రూ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టేవారే. వారి ప్ర‌క‌ట‌న‌లు కూడా భ‌య‌పెట్టేవిధంగా వున్నాయి. ఎన్నిక‌ల‌కు ముంద‌యితేనేం ఇస్తున్నాం క‌దా…ఓటేయాల్సిందేన‌నే బెదిరింపులను చూసి ప్ర‌జ‌లు లోలోప‌ల ఆగ్ర‌హంతో వున్నారు. కొంత‌మంది బైట‌కే తిడుతున్నారు. ప్ర‌భుత్వ డ‌బ్బుతో ఓట్లు కొన‌డానికి ఎన్నిక‌ల‌కు ముందు సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని కుటిల ప్ర‌య‌త్నంగానే చూస్తున్నారు త‌ప్ప చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల‌ప‌ట్ల ప్రేమ వుండి ఇవ్వ‌డం లేద‌నే విష‌యం అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. మ‌సిపూసి మారేడు కాయ చేయ‌డానికి ఎల్లో మీడియా ఎంత ప్ర‌య‌త్నించినా ప్ర‌జ‌ల ముందు ఆ ఆట‌లు సాగ‌వు.
చెమిక‌ల‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here