వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్మోహనరెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన అంశాలు అనేకం వుండవచ్చు. వాటన్నిటిలోకల్లా అతిముఖ్యమైనవి నా దృష్టిలో ఓదార్పుయాత్ర, పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టో. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచీ ఒక జర్నలిస్టుగా ఫాలో అవుతున్నాను కాబట్టి ఈ విషయాన్ని నేను గట్టిగా చెప్పగలను. ఓదార్పుయాత్ర, పాదయాత్రల సారాంశమే 2019 ఎన్నికల మేనిఫెస్టో అని కూడా చెప్పగలను.

2009లో.. వైఎస్ఆర్ అకాలమరణంతో తట్టుకోలేక పలువురు అభిమానులు చనిపోయారు. వారి కుటుంబాలను పరామర్శించి వారి మంచి చెడ్డలు తెలుసుకున్నారు వైఎస్‌జగన్మోహనరెడ్డి. ఓదార్పుయాత్ర ద్వారా మీరు నా కుటుంబ సభ్యులేనంటూ వారికి భరోసా ఇచ్చారు. ఓదార్పుయాత్రలో పలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఇది మానవీయ యాత్ర.

14 నెలలపాటు కొనసాగిన సుదీర్ఘ పాదయాత్రద్వారా ఏపీలోని 13 జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నారు. సూక్ష్మస్థాయిలో ప్రజల స్థితిగతులు చూశారు. చంద్రబాబుప్రభుత్వంలోని డొల్లతనాన్ని స్వయంగా చూశారు. 650 హామీలిచ్చి పాలనలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. పేద ప్రజలతో మాట్లాడారు. వారి ఇళ్లలోకి వెళ్లారు. స్థానిక పరిశ్రమలు, సాగు, తాగునీటి అవసరాల గురించి తెలుసుకున్నారు. యువతతో మాట్లాడారు. వారి ఆకాంక్షలు తెలుసుకున్నారు. నవరత్న పథకాలను తీర్చిదిద్దారు.

వైఎస్‌జగన్‌రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచీ దాదాపుగా పదేళ్ల కాలంపాటు నిత్యం జనంలోనే తిరిగారు. .ఈ పదేళ్లలో వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ప్రతిజిల్లాలో అనేక సార్లు పర్యటించారు. సమస్యలపైన సమగ్రమైన దృక్పథాన్ని ఏర్పరుచుకున్నారు. ఎంతో మంది నేతల్ని, కార్యకర్తల్ని, స్థానిక ప్రజల్ని కలుసుకున్నారు. ఆందోళనలు, దీక్షలు అనేకం చేశారు. పార్టీని నిర్మించారు. ఎన్నెన్నో ఆరోపణలకి ధీటుగా సమాధానమిచ్చారు. కుట్రలు, కుతంత్రాలను హుందాగా ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏం కావాలనేదానిపై జాతీయ మీడియాకు స్పష్టంగా అవగాహన కల్పించారు.

ఈ మొత్తం పదేళ్ల కాలంలో వైఎస్ జగన్ తన అనుభవాల సారాంశంగా నాలుగు పేజీల మేనిఫెస్టో తయారు చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్ధిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటూ పార్టీలో ముఖ్యమైన నేతల అభిప్రాయాలు, ఆలోచనలు, అనుభవాన్ని లెక్కలోకి తీసుకుంటూ ఈ మేనిఫెస్టోను రూపొందించారు. గత ఐదేళ్లలో మేనిఫెస్టో గురించి పదే పదే ప్రస్తావించిన నాయకుడు ఎవరైనా వున్నారంటే అది వైఎస్‌జగనే. దాన్ని పవిత్రమైన డాక్యుమెంట్‌గా ఆయన భావించారు. మేనిఫెస్టో విషయంలో చంద్రబాబు లాగా చేయం…అందరికీ అందుబాటులో వుండేలా పబ్లిక్‌డొమెయిన్లో వుంచుతాం. నిత్యం సమీక్షించి దాన్ని అమలు చేస్తాం. సుపరిపాలన అందిస్తామని వైఎస్‌జగన్ అంటున్నారు. మేనిఫెస్టో అమలు చేయలేని రోజున పదవికే రాజీనామా చేస్తానని అంటున్నారంటే ఆయన ధైర్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
చెమికల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here