చంద్రబాబు, పచ్చ మాఫియా గత ఐదేళ్లుగా చేసిన అరాచకాల పైన, గత ఎన్నికల వాగ్దానాలను తుంగ తొక్కడం పైన, ప్రభుత్వ వైఫల్యాల పైన చర్చ జరగకుండా ఉండటానికే వైఎస్ వివేకాను హత్య చేయించారని అంటున్నారు వైసీపీ నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి పచ్చ మాఫియా చంద్రబాబుకి మిగిలిన ఏకైక మార్గం వైఎస్సార్ కుటుంబాన్ని ఫ్యాక్షన్ కుటుంబంగా చూపించి కోస్తా ప్రజలను భయపెట్టడం, దీన్నే వాళ్ల బీటీమ్ (పవన్ కళ్యాణ్ జనసేన) రిపీట్ చెయ్యడం, పచ్చ మాఫియా మీడియా దీన్నే ప్రచారం చెయ్యడం వాళ్ల అసలు ప్లాన్  అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై నుంచి, తెలుగుదేశం వైఫల్యాల పై నుంచి డిస్కషన్ వైఎస్సార్ కుటుంబంపైకి తీసుకెళ్లడానికి పచ్చ మాఫియా వైఎస్ వివేకానందరెడ్డిని పైశాచికంగా బలితీసుకుందని వైసీపీ భావిస్తోంది.

ఈ తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలనే నిర్ణయానికి వచ్చింది. గతంలో వైఎస్ రాజా రెడ్డిని చంపించి నేరస్తులను తన సొంత ఇంట్లో పెట్టుకున్నది చంద్రబాబు అని వైసీపీ గుర్తు చేస్తోంది. కానీ, వైఎస్ ఒక్క గొడవ చేయడం గాని ప్రతీకారం గాని తీర్చుకోలేిదని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేయించింది చంద్రబాబు, పచ్చ మాఫియా అయినా తాము ఒక్క గొడవ చేయడం గాని, ప్రతీకారం గాని తీర్చుకోలేిదని అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించింది చంద్రబాబు, పచ్చ మాఫియానే అని కానీ, తాము ఒక్క గొడవ చేయడం గాని ప్రతీకారం గాని తీర్చుకోలేిదంటున్నారు.

చంద్రబాబు, పచ్చ మాఫియా నేరాలు చేస్తుంటే వైఎస్సార్ కుటుంబం దేవుడి మీద భారం వేసి వాళ్ల ఖర్మానికి వాళ్లే పోతారని అనుకుందే గాని చీమకు కూడా హాని కలిగించలేదని, ప్రజలే పచ్చ మాఫియా, తెలుగుదేశం చంద్రబాబుకు బుద్ధీ చెబుతారని ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here