ఇండ‌స్ట్రీలో ఉన్న కొంద‌రు హీరోయిన్ల కంటే కూడా మ‌న ద‌గ్గ‌ర స్టార్ యాంక‌ర్లు ఎక్కువ‌గా సంపాదిస్తున్నారు. ఇది న‌మ్మ‌డానికి కష్టంగా అనిపించినా కూడా న‌మ్మి తీరాల్సిన నిజాలు. అంద‌రి సంపాద‌న అలాగే ఉంటుంద‌నుకోవ‌డం అత్యాశే అయినా కూడా కొంద‌రు మాత్రం బాగానే వెన‌కేసుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్స్ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు.

తెలుగు ఇండ‌స్ట్రీలో నెం 1 యాంక‌ర్ ఎవ‌రు అంటే మ‌రో ఆలోచ‌న లేకుండా ఎవ‌రైనా చెప్పే మాట సుమ క‌న‌కాల‌. ఆరేళ్ళ పిల్లాడు కూడా త‌డుముకోకుండా సుమ పేరు చెబుతాడు. ఈమె ఇప్ప‌టికీ ప్ర‌తీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుక‌ల‌కు కూడా వ్యాఖ్యాత‌గా ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్ష‌న్ కు దాదాపు 2 నుంచి 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సుమ వ‌సూలు చేస్తుంద‌ని తెలుస్తుంది.

ఈమె త‌ర్వాత తెలుగులో అన‌సూయ‌కు కూడా ఇదే రేంజ్ డిమాండ్ ఉంటుంది. గ్లామ‌ర్ షోతో మ‌తులు పోగొట్టే రంగ‌మ్మ‌త్త అంటే ప్రేక్ష‌కుల‌కు మోజే. ఈమె ఒక్కో ఈవెంట్ కు దాదాపు 2 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఇక మ‌రో జ‌బ‌ర్ద‌స్థ్ ర‌ష్మి గౌత‌మ్ కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ఈవెంట్స్ కు తోడు ఓపెనింగ్స్ తోనూ సంద‌డి చేస్తుంటుంది ర‌ష్మి. ఈ భామ రెమ్యున‌రేష‌న్ దాదాపు ల‌క్ష‌న్న‌రపైనే ఉంది. సినిమాల్లో క్రేజ్ పెరిగిన త‌ర్వాత ర‌ష్మి రేట్ కూడా డ‌బుల్ అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here