కోడుమూరు:-కర్నూలు పార్లమెంటులో దశాబ్దా కాలం పైగా టిడిపి పరిస్థితి అంతంతమాత్రాన ఉంది.మూడు సార్లు అక్కడి ప్రజలు వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. ఇప్పుడు వైసిపి బలం రెట్టింపు అయింది. ఎస్సీ మరియు మైనారిటీలు ఆది నుంచి వైఎస్ కుటుంబానికి, ప్రస్తుతం వైసిపికి కంచుకోటలాగా ఉన్న విషయం తెలిసిందే.అల్పసంఖ్యలో ఉన్న చేనేత వర్గానికి చెందిన వారికి గతంలో కర్నూలు ఎంపి టిక్కెట్ ఇవ్వగా బ్రహ్మండమైన మెజారిటీతో గెలిచారు.గెలిచిన తర్వాత పార్టీ మారిన బుట్టా రేణుకకు చెక్ పెట్టేందుకు, కర్నూలు పార్లమెంటులో అధిక సంఖ్యలో ఉన్న వాల్మీకి సామజిక వర్గానికి చెందిన బి.వై రామయ్యను రంగంలో దింపడానికి జగన్ సిధ్ధమయ్యారు.బి.వై రామయ్యకు బీసిలలో భారి ప్రజా ఆదరణ ఉండటంతో బీసిలలోని అన్ని కులాల నాయకులు ఆయనకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో బీసిలంతా వైసిపి వైపు ఉన్నారు.అదేవిధంగా ఓసిలంతా అత్యధికంగా వైసిపిలో ఉన్నారనేది అందరికీ తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి చేరబోతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపిగా పోటి చేయనున్నారు.అయితే కోట్ల మరియు కేయి కలుస్తుండటంతో ఆటు కేయి అనుచరులు, ఇటు కోట్ల అనుచరులు భగ్గమంటున్నారు.30ఏళ్లుగా రాజకీయ వైరాలు ఉండీ, ఫ్యాక్షనుతో అనేక విధాలుగా నలిగిపోయినా కోట్ల కేయి అనుచరులు, ఇప్పుడు ఎలా కలిసి పనిచేస్తామంటున్నారు.దీంతో అందరికి చూపు వైసిపి మీద పడింది.దీంతో బి.వై రామయ్య ఆధ్వర్యంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఇటివలే 140 వాహనాలతో వెళ్ళి, వైసిపిలో చేరారు.టిడిపితో కలిసి బలపడాలనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వేసుకున్న వ్యూహం బెడిసికొట్టింది. ఇంకా అనేక మంది బి.వై రామయ్యతో టచ్ లో ఉన్నట్లు సమాచారం.అసలు.పార్టిలో చేరాకముందే ఒక్కక్కరు చేజారిపోతుంటే, పార్టిలో చేరేటప్పుడు,పార్టిలో చేరినా తర్వాత, ఎన్నికల్లో పనిచేసేసరికి ఎంత మంది ఉంటారో అని కోట్లా లోలోన భరించలేని బాధ భరిస్తూ, టిడిపిలో చేరేందుకు ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కు వేస్తున్నారు.

ఈ విధంగా ఎస్సీ, మైనారిటీ, బీసి ఓసిలంతా బి.వై రామయ్య వైపు ఉండగా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైపు కుటుంబ సభ్యులే ఉండటం లేదు.ఇక వచ్చే ఎన్నికల్లో బి.వై రామయ్యతో తలపడటం అంత ఆశామాశి కాదనీ తెలుసుకన్నా కోట్ల, ఎన్నికల వచ్చేసరికి రామయ్య ఇంకా ఎన్ని వ్యుహాలు వేసి, ఇంకా బలహిన పడుస్తాడనీ భయపడుతున్నారు కోట్లా సూర్యప్రకాష్ రెడ్డి.ఇలా బి.వై రామయ్య పనితీరును ఎప్పుడో గమనించిన మాజి కాంగ్రెస్ నేతలు ప్రస్తుత వైసిపి నేతలు, బుట్టా పార్టీ మారతాదనేది పసిగట్టి, కోట్లాకు మరియు టిడిపిని ఎదుర్కోనే దమ్ము ధైర్యం ఉన్న బి.వై రామయ్యను పార్టిలోకి చేర్పించుకుని, కర్నూలు పార్లమెంట్ ఇంచార్జుగా నియమించారు.వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపిగా పోటీ చేయించేందుకు వైసిపి ఎప్పుడో సిధ్ధమైంది.వాస్తవానికి కర్నూలు పార్లమెంటులో కాంగ్రెస్ నుంచి కోట్లా, అధికార పార్టీ నుంచి బుట్టా ఉంటుదనీ భావించి, వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టం అవుతుందనీ అనుకున్నారు.కానీ ఇప్పుడు చూస్తే సమర్థవంతమైన నాయకుడు బి.వై రామయ్య పార్టిలో చేరడం, కోట్ల టిడిపిలో చేరడంతో, త్రిముఖ పోటీ లేకపోవడం మరియు కోట్లా కేయి అనుచరగణం బి.వై రామయ్య సారథ్యంలో పనిచేయడానికి పార్టిలోకి రావడం వైసిపికి ఎంతో కలిసొచ్చే అంశాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here