టీవీ9 సీఈవో పదవి తనను తప్పించడంపై రవి ప్రకాశ్ స్పందించారు. అసత్యాలతో మోసగించి,
వెనుక దారిలో tv9 సంస్థలోకి చొరబడ్డారని అలంద మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారని మండిపడ్డారు.
సీఈవోగా తప్పించినప్పటికీ షేర్ హోల్డర్‌గా, వాటా ప్రతినిధిగా టీవీ9లో అలంద మీడియా పక్కనే తాను
ఉంటానని స్పష్టంచేశారు రవిప్రకాశ్.

టీవీ9ని వదలబోనని పరోక్షంగా తేల్చిచెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో TV9 వ్యవస్థాపక అధ్యక్ష
పదవికి సైతం ఆయన రాజీనామా చేసేశారు. రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే
లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే tv9 నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు.
ఎన్‌సిఎల్‌టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు.

ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఎబిసిఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో
tv9 స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు ఫిర్యాదులు, కేసులతో నన్ను వేధించే ప్రయత్నం చేశారు.
పోలీసులను యధేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులువేసి మీ చేతుల్లోని మీడియాలో
అసత్య ప్రచారం చేశారు. నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి
చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారని విమ‌ర్శించారు ర‌విప్ర‌కాశ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here