ఇంట్లో కూర్చుని బాబాయ్ జ‌న‌సేన పార్టీకి ఓటేయండి అంటూ ప్ర‌చారం చేస్తున్నాడు చ‌ర‌ణ్‌. ప‌వ‌న్ పిలిస్తే బ‌య‌టికి వ‌చ్చి ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పిన రామ్ చ‌ర‌ణ్.. ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నం మానుకుని సోష‌ల్ మీడియాతో స‌రిపెడుతున్నాడు.

తాజాగా త‌న ఫేస్ బుక్ పేజీలో జ‌న‌సేన పార్టీ గురించి పోస్ట్ చేసాడు మెగా వార‌సుడు.జ‌న‌సేన మేనిఫెస్టో చూసాను.. అద్భుతంగా ఉంది.. అన్ని వ‌ర్గాల వారికి స‌మ‌న్యాయం చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.ఆల్ ది బెస్ట్ క‌ళ్యాణ్ బాబాయ్ అంటూ పోస్ట్ చేసాడు రామ్ చ‌ర‌ణ్.

అంతేకాదు అంతా జ‌న‌సేన పార్టీకి ఓటేయండి.. ఓట్ ఫ‌ర్ గ్లాస్ అంటూ రాసుకొచ్చాడు చ‌ర‌ణ్. జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌కు.. అభ్య‌ర్థుల‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. క‌చ్చితంగా జ‌న‌సేన ప్ర‌భుత్వం రావాల‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు చ‌ర‌ణ్. మార్పు రావాలంటూ క‌ళ్యాణ్ బాబాయ్ వైపు న‌డ‌వండి అంటూ ఇప్ప‌టికే చాలా సార్లు చెప్పాడు చ‌ర‌ణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here