తెలుగు ఇండ‌స్ట్రీలో ల‌క్ష్మీ రాయ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కెరీర్ మొద‌ట్నుంచీ కూడా ఈ ముద్దుగుమ్మ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ అనిపించుకుంది. ఇప్పుడు వీట‌న్నింటిపై మాట్లాడింది ఈ భామ‌. తాజాగా త‌నపై జ‌రుగుతున్న ప్ర‌చారానికి ట్విట్ట‌ర్లో ఫుల్ స్టాప్ పెట్టింది ల‌క్ష్మీరాయ్. ముఖ్యంగా త‌ను గ‌ర్భ‌వ‌తిని అంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించింది .

నాకు చాలా మందితో రిలేష‌న్ ఉంది.. ల‌వ్ ఎఫైర్స్ కూడా ఉన్నాయి.. బ్రేకప్ కూడా జరిగింది.. అంత మాత్రానికే మీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌చారం చేస్తారా అంటూ ఈమె రెచ్చిపోయింది. ఇప్పుడు ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారిపోయింది. పిచ్చి వార్త‌లు రాస్తే క‌చ్చితంగా లీగ‌న్ నోటీసు పంపిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా వేర్ ఈజ్ వెంక‌టల‌క్ష్మి సినిమాలో న‌టిస్తుంది ల‌క్ష్మీ రాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here